వరుణ్ సందేశ్ ‘విరాజి’ చిత్రానికి U/A. ఆగస్టు 2న విడుదల

Must Read

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని వీక్షించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తముగా ఆగస్టు 2న విడుదలకు సిద్ధంగా ఉంది.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “మా విరాజి చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్రం చాలా బాగుంది అని కొనియాడారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2 న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.
సినిమా పేరు: విరాజి

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు…

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పి ఆర్ ఓ: పవన్ పాల్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
వి ఎఫ్ ఎక్స్ : అఖిల్
పోస్టర్ డిజైన్స్: జి.దినేష్, గణేష్ రత్నం
స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం
డిజిటల్ పి ఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్
ఆడియో ఆన్: శబరి మ్యూజిక్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News