తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, అనిల్ అర్కా – విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సర్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ, “ఈ కథ యూత్‌ను ఎట్రాక్ట్ లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అందరిని ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులందరికీ నచ్చే కథను అందించామనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘వారధి’లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. ‘వారధి’ సినిమా ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
సమర్పణ: వెబ్జీయార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
బ్యానర్: రాధాకృష్ణ ఆర్ట్స్
చిత్ర శీర్షిక: వారధి
సెన్సార్: U/A 16+
జానర్: ప్రేమ, రొమాన్స్, థ్రిల్లర్, డ్రామా
నటీనటులు:
హీరో: అనిల్ అర్కా
హీరోయిన్: విహారికా చౌదరి
ప్రతినాయక పాత్ర: ప్రశాంత్ మడుగుల
ప్రధాన పాత్ర: రిధి
సాంకేతిక బృందం:
కథ & దర్శకత్వం: శ్రీ కృష్ణ
నిర్మాతలు: పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్
రచయిత: నాగేంద్ర పలగాని
సినిమాటోగ్రఫీ: శక్తి .జె కె
సంగీత దర్శకుడు: షారుఖ్ షేక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎన్. చందు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…