పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

Must Read

హైద‌రాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు.

తాజాగా చిత్ర‌యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజ‌కీయ విశ్లేష‌కులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్రాన్ని అభినందించారు.

ఈ చిత్రాన్ని భారతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, “కోటి మొక్కలు నాటి ప్రకృతికి సేవ చేసిన రామయ్య గారి జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా ఈ బయోపిక్‌ను తీసుకురానున్నాం” అని తెలిపారు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తూ, ఈ చిత్రాన్ని ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు నివాళిగా అంకితం చేస్తున్నామని చెప్పారు.

రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఊరూరూ తిరిగిన ఆయన, శుభకార్యాల్లో మొక్కలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా సరికొత్త ఆచారాన్ని నెలకొల్పారు. చెట్ల గింజలను సేకరించి అటవీ ప్రాంతాల్లో చల్లడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది.

ప్రకృతిని ప్రేమించిన ఆ మహానుభావుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకృతి ఒడిలో కలిసిపోయినప్పటికీ, ఆయన చూపించిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు, స్ఫూర్తి మరింత విస్తృతంగా ప్రజలకు చేరవ కానున్నాయి.

నటినటులు:
బ్రహ్మాజీ
నాగరాణి
నాగమల్ల మహేష్
శ్రీనివాస రాయుడు
బిక్షపతి
తిరుపతి సిద్దిపేట
శంకర్ దుబ్బాక
పైడిపల్లి చైతన్య
బుసం రవీంద్రనాథ్
మాస్టర్ “రిషికేష్ బాబు
సురేష్‌బాబు గొడిశాల

స్వాతి
త్రివేణి
విశ్వామిత్ర చౌహాన్

చంద్రశేఖర్

సాంకేతిక నిపుణులు

రచయిత: డా.కళా రంగా
సంగీత దర్శకుడు: బల్లేపల్లి మోహన్
సాహిత్యం: గానయాది
D.O.P: తోట వి రమణ
ఎడిటర్: దాము
ఇప్పటికీ: M v రమణ
పిఆర్‌ఓ: దయ్యాల అశోక్

కళ: లావణ్య.వి

నిర్మాతలు:
నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి
బుసం రవీంద్రనాథ్
లింగంపల్లి చంద్రశేఖర్

దర్శకుడు:
వేముగంటి

(నంది అవార్డు గ్రహీత)

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News