మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ప్రజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్ వుంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారుఅంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లావిష్ ప్రొడక్షన్ డిజైన్‌కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా వుంటుంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా మెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, ఊర్వశి రౌతేలా (స్పెషల్ సాంగ్) తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…