ఆది సాయికుమార్, 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పీ, డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ కాంబో సినిమా “అరుంధతి నక్షత్రం” ఘనంగా ప్రారంభం..!

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అరుంధతి నక్షత్రం”. ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ “అరుంధతి నక్షత్రం” సినిమాను నిర్మిస్తున్నాయి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

ఈ రోజు హైదరాబాద్ లో “అరుంధతి నక్షత్రం” సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యాక్టర్ సాయి కుమార్ క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు. “అరుంధతి నక్షత్రం” ఆది సాయికుమార్ 28వ సినిమాగా రాబోతోంది.

“అరుంధతి నక్షత్రం” సినిమా అనౌన్స్ మెంట్ సందర్బంగా మేకర్స్ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను గుర్తుచేసేలా మెమొరీ కార్డ్ లోని ఫొటోస్ ను పోస్టర్స్ గా ప్రింట్ చేసి “అరుంధతి నక్షత్రం” సినిమా రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా ఇది ఒక మంచి రూరల్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది. ఈ నెలలోనే “అరుంధతి నక్షత్రం” సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నామని, తమ బ్యానర్ కు మరింత పేరు తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని ప్రొడ్యూసర్స్ తెలిపారు.

నటీనటులు – ఆది సాయికుమార్, మేఘ శెట్టి, మధు దామరాజు, తదితరులు

టెక్నీషియన్స్

సౌండ్ డిజైనర్ – అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ – ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన
లిరిక్స్ – సనరే
ఎడిటర్ – నరేష్ అడుపా
డీవోపీ – ఫహాద్ అబ్దుల్ మజీద్
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రియ నాయర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ప్రజ్నయ్ కోనిగరి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ – 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి
ప్రొడ్యూసర్స్ – సదీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల
స్క్రిప్ట్, డైరెక్షన్ – రాహుల్ శ్రీనివాస్
డిజిటల్ – కనెక్ట్ డిజిటల్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్. మీడియా)

TFJA

Recent Posts

నవంబర్ 20న విడుదలవుతోన్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్..!

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అలీ శరణ్య,…

1 hour ago

సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు TFJA ప్రతినిధుల జన్మదిన శుభాకాంక్షలు..!

అందరి బంధువు, చిత్రపరిశ్రమ శ్రేయోభిలాషి, కార్మికుల పాలిట పెన్నిధి, చిన్న నిర్మాతల పక్షపాతి, సినీ జర్నలిస్టుల ఆత్మీయుడు అయిన సీనియర్…

1 day ago

31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న ‘నమస్తే వరల్డ్..!

· కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాల ఏర్పాటుతో 1,050 మందికి ఉపాధి అవకాశాలు ·…

2 days ago

హీరో సుధాకర్ కోమాకుల ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల !!!

శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చార్లీ చాప్లిన్…

4 days ago

‘హల్కా డాన్’గా ‘లెనిన్’లో విలక్షణ నటనతో మెప్పించిన ప్రమోద్.. అదిరిపోయిన మాస్ ఫస్ట్ కట్ టీజర్..!

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా…

4 days ago

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్..!

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’ (చాప్టర్ క్లోజ్). వికాస్,…

4 days ago