హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచెర్ల. తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ‘పట్నం పిల్లా..’ .. ‘ఓరి మాయలోడా..’ సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. హీరోకి పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావటం లేదని బాధ ఎక్కువ అవుతుంటుంది. అందుకు కారణం.. తనేమీ చదువుకోడు.. కానీ బాగా చదువుకున్న పిల్లనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతని ఆశలకు తగ్గట్టే మన అందమైన హీరోయిన్ అతన్ని ప్రేమిస్తుంది. చాలా మంది చదువుకున్న అమ్మాయిలకు నచ్చని హీరోని హీరోయిన్ మాత్రం ఎందుకు ప్రేమించిందా! అనేది చాలా మందిలో ఉండే ప్రశ్న. కానీ.. కథలో అసలు ట్విస్ట్ అదే. మన హీరోయిన్లో మరో కోణం బయటకు వస్తుంది. దెబ్బకు హీరో భయపడతాడు.. ఏం చేయాలో తెలియక పారిపోవాలనుకుంటాడు.. ఇంతకీ హీరోయిన్ ఏం చేసింది.. ఆమెను చూసి హీరో ఎందుకు భయపడ్డాడు.. చివరకు ఏమైందనేది తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.
సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
నటీనటులు:
తేజస్ కంచెర్ల, ఖుష్బూ చౌదరి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లీడ్ ఎడ్జ్ పిక్చర్స్, దర్శకత్వం: వివేక్ రెడ్డి, నిర్మాత: కంచెర్ల బాల భాను, సినిమాటోగ్రపీ: సన్నీ కూరపాటి, మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు, సౌండ్ డిజైన్: ప్రదీప్.జి, ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి, ఆర్ట్: వివేక్ అన్నామలై, కొరియోగ్రఫీ: జీతూ మాస్టర్, ఫైట్స్: రాబిన్ సుబ్బు, పి.ఆర్.ఒ: వంశీ కాకా.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…