‘అనుకోని ప్రయాణం’ ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు నటుడు సోహెల్, దర్శకులు వీరభద్రమ్, ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి, విజయ భాస్కర్ కె, నందిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నా నట జీవితంలో చేసిన చిత్రాలలో ది బెస్ట్ ‘అనుకోని ప్రయాణం’. కెరీర్ లో తొలిసారి ఒక సినిమా విషయంలో టెన్షన్ గా వున్నాను.’అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ, మనసుకు ఎంతగానో నచ్చి నటించిన ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ వుంది. ఆ నలుగురు సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. ఆ సినిమా ట్రైలర్, పోస్టర్ లో నేను సీరియస్ గాకనిపిస్తే అందరూ కాస్త సర్ప్రైజ్ అయ్యారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలా వుంటుందో చూపించే కథ అది. అందరూ నవ్వినవ్వి వంద రోజులు చూశారు. ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది. కరోనా సమయంలో మనసుని హత్తుకునే కథలు చాలా జరిగాయి.

‘అనుకోని ప్రయాణం’ కరోనా సమయంలో ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే అద్భుతమైన కథ. ఒరిస్సా నుండి రాజమండ్రి వరకు జరిగే ఒక ‘అనుకోని ప్రయాణం’ ఇందులో అద్భుతం.  ఇది బాధలు చూపించే సినిమా కాదు. గోలగోల చేసే సినిమా. ప్రేక్షకులు కూడా కచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి చేశాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతమంది చూస్తే అంత సంతోషపడతాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితీరుతుంది. నరసింహ రాజు గారు ఈ కథలో నటించడమే ఒక విజయం. ఆయన అనుభవం ఈ సినిమాలో ఎంతగానో ఉపయోపడింది. డా.జగన్ మోహన్ అద్భుతమైన కథ రాశారు. వెంకటేష్ పెదిరెడ్ల చాలా చక్కగా సినిమాని తీశారు. డీవోపీ  మల్లికార్జున్ , సంగీతం శివ దినవహి .. ఇలా సాంకేతిక నిపుణులంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. బెక్కం వేణుగోపాల్ మంచి కంటెంట్ ని ఎంపిక చేసుకునే నిర్మాత.

‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 28న అందరూ థియేటర్లో చూడాలి” అని కోరారు.నరసింహ రాజు మాట్లాడుతూ..  రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఆయనికి ఆయనే సాటి. షూటింగ్ సమయంలో కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. డా.జగన్ మోహన్ , వెంకటేష్ పెదిరెడ్ల, శివ దినవహి ఇలా అందరూ యంగ్ టీంతో కలసి చేసిన సినిమా ఇది. అక్టోబర్ 28న థియేటర్లో విడుదలౌతుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది” అని అన్నారు.నిర్మాత డా.జగన్ మోహన్ మాట్లాడుతూ..’అనుకోని ప్రయాణం’లో రాజేంద్ర ప్రసాద్ గారు టెన్షన్ పెడతారు, నవ్విస్తారు. సినిమా అంత ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.  మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కరోన సమయంలో ఈ సినిమా కథ రాసే సమయం దొరికింది. అందరూ ప్రతిభగల నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు.’అనుకోని ప్రయాణం’ ఫీల్ గుడ్ మూవీ. మీ అందరి హార్ట్ ని టచ్ చేసే సినిమా అవుతుంది.  అక్టోబర్ 28న అందరూ  థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి” అని కోరారు.సోహెల్ మాట్లాడుతూ..  రాజేంద్ర ప్రసాద్ యువతకు స్ఫూర్తి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నటకిరీటి అనిపించుకున్నారు.  ‘అనుకోని ప్రయాణం’ అందరూ చూడాల్సిన సినిమా.’అనుకోని ప్రయాణం’ పండగలాంటి సినిమా. ఫ్యామిలీ అంతా కలసి థియేటర్ లో సినిమా  చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.విజయ్ భాస్కర్ కె మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పాత్రనైనా చేయగల గ్రేట్ యాక్టర్.అనుకోని ప్రయాణం’ ట్రైలర్ చూస్తుంటే చాలా డెప్త్ వున్న కథలా అనిపిస్తుంది. గొప్ప ఎమోషనల్ జర్నీ కనిపిస్తోంది.సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరారు

ఎస్ వి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ..  అనుకోని ప్రయాణం ట్రైలర్ అద్భుతంగా వుంది. దీనికి కారణం మా రాజేంద్రప్రసాద్ గారు. అనుకోని ప్రయాణం ప్రయాణం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. డా.జగన్ మోహన్ గారు ఈ కథ రాయడంతో పాటు నిర్మంచడం చూస్తుంటే ఆయనకి కథపై వున్న నమ్మకం అర్ధమౌతుంది. వెంకటేష్ చక్కగా దర్సకత్వం చేశారు. శివ దినవహి మంచి మ్యూజిక్ చేశారు. అనుకోని ప్రయాణం అక్టోబర్ 28న వస్తోంది. ఈ సినిమా సంచలన విజయం సాధించాలి” అని కోరారు.బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. అనుకోని ప్రయాణం కథ నచ్చి సినిమా యూనిట్ ప్రయాణం మొదలుపెట్టాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమా చేయడం ఒక మలుపు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బావుంది. చాలా కొత్తగా వుంటుంది. తెలుగు ప్రేక్షకుల కొత్తదనంను ఆదరిస్తారు. ఈ సినిమాకి కూడా మంచి విజయం అందిస్తారనే నమ్మకం వుంది. అక్టోబర్ 28న సినిమా చూసి ఆశిర్వదించాలి’ అని కోరారు

నందిని రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ గారు ఇప్పటికీ తొలి సినిమా చేస్తున్న కుర్రాడిలా ఎంతో ఉత్సాహంగా వుంటారు. ఆయన మాకు స్ఫూర్తి.  అనుకోని ప్రయాణం చాలా మంచి సినిమా అవుతుంది. బెక్కం వేణుగోపాల్ మంచి కథలని ఎంపిక చేసుకుంటారు.  ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతమైన కథ అనిపిస్తింది. వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాను” అన్నారు 

తారాగణం : డాక్టర్ రాజేంద్రప్రసాద్ , నరసింహరాజు,  ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్ నారాయణరావు , అనంత్ ప్రభాస్ శ్రీను  రంగస్థలం మహేష్  . జోగి సోదరులు ధనరాజ్  . కంచరపాలెం కిషోర్ , జెమిని సురేష్  తాగుబోతు రమేష్

టెక్నికల్ టీమ్ :

రచన,దర్శకత్వం – వెంకటేష్ పెదిరెడ్ల

కథ, నిర్మాత – డా.జగన్ మోహన్ డి వై

సమర్పణ : బెక్కం వేణుగోపాల్

డీవోపీ – మల్లికార్జున్ నరగాని

సంగీతం – ఎస్ శివ దినవహి

డైలాగ్స్ – పరుచూరి బ్రదర్స్

ఎడిటర్ – రామ్ తుము

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మణికుమార్ పాత్రుడు

ఆర్ట్ డైరెక్టర్ – సురేష్ భీమగాని

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

23 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago