మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న “వీరఖడ్గం”

వివివి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం`. మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూస‌ర్‌. సృష్టి డాంగే హీరోయిన్‌.  ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్  ఈ రోజు ఫిలిం చాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ...“ద‌ర్శ‌కుడు ఎమ్ ఏ చౌద‌రి ప్ర‌తిభావంతుడు. చాలా కాలంగా తెలుసు. పాట‌లు బావున్నాయి. ఈ సినిమా విజ‌య‌వంత‌మై ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
ద‌ర్శ‌కుడు ఎమ్ఏ చౌద‌రి మాట్లాడుతూ…“ చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి…పగ కూడా అంతే.  ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా  సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ…. వీరఖడ్గం. గ్రాఫిక్స్ కి  ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది. నిర్మాత  కోటేశ్వ‌ర‌రావు , లైన్ ప్రొడ్యూస‌ర్ సునీల్ కుమార్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. షాయ‌క్ ప‌ర్వేజ్ మంచి సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. మార్చి మూడో వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
 లైన్ ప్రొడ్యూస‌ర్ మారుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ...“నిర్మాతగా నేను గ‌తంలో `రెండో కృష్ణుడు` అనే సినిమా తీశాను. ఆ త‌ర్వాత ఎమ్ఏ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఇంద్రాణి, చిలిపికృష్ణుడు చిత్రాల‌కు ఫైనాన్సియ‌ర్ గా చేశాను. క‌థ న‌చ్చి `వీర‌ఖ‌డ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూస‌ర్ గా చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...“సినిమా చూశాను. మంచి గ్రాఫిక్స్ తో చాలా గ్రాండ్ గా తీశారు. పాట‌లు కూడా బావున్నాయి. లొకేష‌న్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుక‌రావాల‌న్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు షాయ‌క్ ప‌ర్వేజ్ మాట్లాడుతూ...“ ఇందులో నాలుగు పాట‌లున్నాయి.  సునీత , లలిత సాగ‌రి, సాహితి, రామ‌కృష్ణ పాట‌లు పాడారు. ద‌ర్శ‌కుడు చౌద‌రి గారు నాతో క్వాలిటీ వ‌ర్క్ చేయించుకున్నారు. 300 ఏళ్ల క్రితం పార్వ‌తిపురంలో జ‌రిగిన  ఓ య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా “ అన్నారు.
   బ్రహ్మానందం,  సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్,  మదన్, తపస్వి, అపూర్వ,  పృద్విరాజ్, టార్జన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, చలపతి రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాట‌లుః ఘ‌టికాచ‌లం; సంగీతంః షాయ‌క్ ప‌ర్వేజ్‌;  పీఆర్ ఓః ర‌మేష్ చందు;  ఫైట్స్ః నందు, దేవరాజ్ మాస్టర్, లైన్ ప్రొడ్యూస‌ర్ః మారుశెట్టి సునీల్ కుమార్‌;  ప్రొడ్యూసర్ :K. కోటేశ్వరరావు, దర్శకత్వం. ఎం ఏ చౌదరి.

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago