తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మరియు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారికి నివాళులర్పించిన సినీ ప్రముఖులు
సినీ దిగ్గజ నిర్మాత, ఈనాడు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ రామోజీరావు గారు మృతితో శోకసంద్రంలో మునిగిన తెలుగు సినీ ఇండస్ట్రీ. నేడు ఆయన మృతికి నివాళులర్పిస్తూ తెలుగు సినీ ప్రముఖులు టీ ఎఫ్ పి సి లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు, నిర్మాత కేఎస్ రామారావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవి గారు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్ గారు, డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, డైరెక్టర్ అసోసియేషన్ సెక్రెటరీ సుబ్బారెడ్డి గారు TFPC ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, స్రవంతి రవి కిషోర్ గారు, అంబటి శ్రీను గారు, విజయేంద్ర రెడ్డి గారు, శివలింగ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామోజీరావు గారికి నివాళులర్పిస్తూ చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : అతి సామాన్యుడి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రిని ఒక నిర్మాత తన భుజాల పైన మోయడం మామూలు విషయం కాదు. ఒక మనిషి చనిపోయిన కూడా జన హృదయాల్లో నిలిచిపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి వ్యక్తుల్లో ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎస్వీ రంగారావు గారు, కృష్ణంరాజు గారు ఇప్పుడు అదే కోవలో రామోజీరావు గారు కూడా ఉంటారు. ఒకరిని మోసం చేయకుండా ఒకరి దగ్గర సొమ్ము లాక్కోకుండా తన శక్తితో పైకి ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి ఆయన ఈరోజు మనతో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత కె. ఎస్. రామారావు గారు మాట్లాడుతూ : ఒక లెజెండ్రీ పర్సన్, నిర్మాత, బిజినెస్ మాన్ రామోజీరావు గారు ఈరోజు మనతో లేకపోవడం బాధాకరం. సినిమా ఇండస్ట్రీ గురించి అంతగా అవగాహన లేకపోయినా 1996లో అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీ నిర్మించడం సాధారణ విషయం కాదు. ఒక సినిమాకి కావాల్సిన ప్రతి సెట్ రామోజీ ఫిలిం సిటీ లో ఉండడం ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి రావడం మామూలు విషయం కాదు. అదేవిధంగా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ : 1989లో మేము రామోజీరావు గారికి మౌన పోరాటం సినిమాకి మాటలు రాశాం. కానీ మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ ప్రియా పచ్చళ్ల కంపెనీలో పనిచేసేవారు. కానీ మాకు మాత్రం మౌన పోరాటం వరకు ఆ అవకాశం దొరకలేదు. ఆయన తీసిన సినిమాల్లో ప్రతిఘటన సినిమా వినోదం కోసమే కాదు విజ్ఞానం కోసం అని కూడా చెప్పినటువంటి సినిమా. ఎప్పటికీ నాశనం లేనిది అక్షరం. అలాంటి అక్షర యోధుడు రామోజీరావు గారు. సినీ ఇండస్ట్రీలో ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం అన్నారు.
విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ : రామోజీరావు గారితో నాకు డైరెక్ట్ గా ఎలాంటి అనుబంధం లేదు. కానీ ఆయన సమయానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి. సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అని చెప్పిన వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు.
మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవి గారు మాట్లాడుతూ : 24 క్రాఫ్ట్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి రామోజీరావు గారికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. పరిస్థితులని మార్చడానికి ఒకరు ప్రింట్ మీడియా ఒకరు డిజిటల్ మీడియా వాడతారు కానీ అన్నిటినీ వాడి ప్రజలకు సత్యాన్ని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పేపర్ చదవకపోతే రోజు గడవదా అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఒక పత్రిక ద్వారా ఇంతటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఒక న్యూస్ పేపర్ ద్వారానే కాకుండా మంత్లీ పత్రికల ద్వారా ఎంతో మంది రచయితలకు అవకాశాన్ని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అన్నారు.
డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్ గారు మాట్లాడుతూ : ఆయన ఎంతో మానసిక ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమైన పొద్దున్నే లేచి చదివే ఈనాడు న్యూస్ పేపర్ లో ఉంటారు చూసే ఈటీవీ ఛానల్ లో ఉంటారు తినే ప్రియా పచ్చళ్ళలో ఉంటారు ఆయన దూరమైన మనతో పాటే ఉన్నారు ఉంటారు. అదేవిధంగా సినిమా షూటింగులు అంటే మనకు గుర్తొచ్చేది రామోజీ ఫిలిం సిటీ సినిమా రిలీజ్ అవ్వాలంటే గుర్తొచ్చేది మయూరి డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఇలా ప్రతి దాంట్లో ఆయన ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు.
దర్శకుడు అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ : మహాభారతంలో భీష్ముడికి అధర్మ యుద్ధం చేస్తూ ఎప్పుడు తను చాలించాలో తెలిసి ప్రాణాలు వదిలేస్తారు. అదేవిధంగా రామోజీరావు గారు ధర్మ యుద్ధం చేసి ప్రాణాలను విడిచారు. ఆయన అనుకున్నది నెరవేరి ధర్మం గెలిచింది అన్న ఆనందంతో ఆయన తను చాలించినట్టు అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ఫోర్త్ ఎస్టేట్ ని ఆయన నిలబెట్టినట్టు ఎవరూ నిలబెట్టలేదు. ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా. మీడియా ద్వారా ఎన్నో మంచి పనులను చేసి ప్రజలకు సత్యాన్ని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిజంగా ట్రూ లెజెండ్. ఎన్నో సంస్థలు స్థాపించి ఎంతో మంది ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను నిలబెట్టిన వ్యక్తి. ఆయన ఈరోజు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు గారు మాట్లాడుతూ : రామోజీరావు గారితో నాకున్న అనుభవాన్ని చెప్పాలి. 1992 లో నాకు ఉషాకిరణ్ మూవీస్ నుంచి పిలుపు వచ్చింది. మీరు డైరెక్టర్ గా అనుకుని ఒక సినిమా అనుకుంటున్నాం చేస్తారా. రామోజీరావు గారు సంస్థలో చేయడం అదృష్టంగా భావించి బయలుదేరి వచ్చాం. ఆయన్ని సాయంత్రం 5.30ki కలవాలి 4.30 కి కారు వచ్చింది. కరెక్ట్ గా 5:30 కి ఆయన నుంచి పిలుపు వచ్చింది. ఆయన టైం పంచువాలిటీ బాగా పాటిస్తారు. కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఆయనతో అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అక్షర యోధుడు ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఆర్టిస్ట్ శివారెడ్డి గారు మాట్లాడుతూ : ఎన్నో కుటుంబాలకి ఉద్యోగం ఇచ్చి ఆసరాగా నిలిచిన మహా వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి కుటుంబాలలో మాది ఒకటి. నేను ఫస్ట్ కామెడీ చేయడానికి వచ్చినప్పుడు ఈటీవీలోనే చేయడం జరిగింది. నేను ఫస్ట్ నంది అవార్డు అందుకుంది కూడా ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమా నుంచి. అంతేకాకుండా ఆయన చేతుల మీదుగా ఎన్నోసార్లు అవార్డులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు ఎన్నో అవకాశాలు రావడానికి కారణమైన సినిమా ఉషాకిరణ్ సంస్థ నుంచి వచ్చిన ఆనందం. అలాంటి ఒక గొప్ప సినిమా ఇచ్చి మళ్లీ వెనుతిరిగి చూడకుండా చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : కొత్త టెక్నీషియన్స్ ని, కొత్త ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి విభిన్న సినిమాలు నిర్మించిన వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా మయూరి డిస్ట్రిబ్యూషన్ ద్వారా మంచి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం. పాడైపోయిన థియేటర్లను లీజుకు తీసుకుని రెనోవేట్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం. అదేవిధంగా ఎన్నో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్ని దాచి భావితరాలకు ఆ సినిమాల్ని అందించి వాటి విలువల్ని తెలియజేయడం. అదేవిధంగా అక్షరమనే ఆయుధంతో సమాజానికి ఎంతో మేలు చేయడం సమాజంలోని చెడును తొలగించడం ప్రజలకు మంచి చేయడం వంటి ఎన్నో పనులు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…