నిహారిక చేతుల మీదుగా ట్రెండింగ్‌లవ్‌ ఫస్ట్‌లుక్‌

వర్ధన్‌ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీలు ముఖ్య పాత్రల్లో నటించగా వెల్‌నోన్‌ షార్ట్‌ఫిలిమ్‌ మేకర్‌ హరీశ్‌ నాగరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ట్రెండింగ్‌లవ్‌’. దొరకునా ఇటువంటి ప్రేమ ట్యాగ్‌లైన్‌. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ పతాకాలపై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సోనుగుప్తా, రూపేశ్‌ డి గోయల్‌ నిర్మాతలు. ‘ట్రెండింగ్‌లవ్‌’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక చేతులమీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ– ‘‘‘ట్రెండింగ్‌లవ్‌’ దర్శకుడు హరీశ్‌తో నేను గతంలో యూట్యూబ్‌ కోసం చేసిన షార్ట్‌ఫిలింలో పనిచేశాను. ఎంతో టాలెంట్‌ ఉన్న దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌ సమాజంలో ఉన్న కరెంట్‌ సిట్యూవేషన్‌ను ఎలివేట్‌ చేసేలా ఉంది. సినిమాలోని కొన్ని కట్స్‌ చూశాను. చాలా బావున్నాయి. ఈ టీమ్‌ అందరికి చక్కని విజయం దక్కాలని మనస్ఫూర్తిగా

కోరుకుంటున్నాను’’ అన్నారామె. దర్శకుడు హరీశ్‌ నాగరాజు మాట్లాడుతూ–‘‘ నేను ఒక్క మెసేజ్‌ పెట్టి మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మీ చేతుల మీదుగా ఓపెన్‌ చేయండి అని అడగ్గానే సరే అని మాటీమ్‌ని ఎంకరేజ్‌ చేయటానికి ముందుకొచ్చారు నిహారికగారు. టాలెంట్‌ ఉన్న ఎంతోమందికి కేరాఫ్‌ అడ్రస్‌గా పింక్‌ ఎలిఫెంట్‌ సంస్థ మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్‌ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సోనుగుప్తా, రూపేశ్‌ డి గోయల్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మధుర ఆడియో ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంగీతం– సునీల్‌ కశ్యప్, కెమెరా– బ్రహ్మతేజ మరిపూడి, నిఖిల్‌ కాలేపు, ఎడిటింగ్‌– గ్యారి బి.హెబ్, లిరిక్స్‌– బాలాజి, విశ్వనా«ద్‌ కరసాల, ఆర్ట్‌– షర్మిల ఎలిశెట్టి..

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago