అహా ఓటీటీలో దుమ్ము రేపుతున్న తురుమ్ ఖాన్ లు మూవీ.. మొదలు పెడితే నవ్వుతూనే ఉంటారు

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెలంగాణ యాస, భాష నేపథ్యంలో విలేజ్ నేటివీటితో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తురుమ్ ఖాన్ లు. ఈ సినిమా గురించి తెలిసిన ప్రేక్షకులు ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా తురుమ్ ఖాన్ లు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కామెడీ బిట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలతో ఆధ్యాంతం అలరించేలా సాగే ఈ చిత్రం ఇన్నాళ్లు ఎక్కడ ఉందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు అంటే… ఈ చిత్రం వారి హృదయాలకు ఎంతలా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటికైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

కథ విషయానికి వస్తే..
తుపాకుల గూడెం అనే గ్రామంలో శంకర్‌ (నిమ్మల శ్రీరామ్‌)యూత్‌ లీడర్‌. కరోనా సమయంలో మరదలు లలిత(ఐశ్వర్య ఉల్లింగాల)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఊర్లో లాక్‌డౌన్‌ విధించడంతో పెళ్లి ఆగిపోతుంది. అయితే తన పెళ్లి ఆగడానికి కారణం విరాజ్‌ బ్రహ్మా(దేవరాజ్‌ పాలమూర్‌). దీంతో బ్రహ్మాపై పగ పెంచుకుంటాడు శంకర్‌. మరోవైపు బ్రహ్మకు అన్ని ఉన్నా.. ఇంకా పెళ్లి కాదు. ఇక లాక్‌డౌన్‌లో ఊరికి వచ్చిన బ్రహ్మా.. భారతి(పులి సీతా) తో ఎఫైర్‌ పెట్టుకోవాలనుకుంటాడు. మరోవైపు శంకర్‌ స్నేహితుడు విష్ణు(అవినాష్‌ చౌదరి) మనస్పర్థాల కారణంగా దూరం అయిన తన ప్రేయసి పద్మను కలిసేందుకు ప్రయత్నిస్తుంటాడు. విష్ణు-పద్మలు విడిపోవాడానికి కారణం ఏంటి? శంకర్‌ పెళ్లిని బ్రహ్మా ఎలా, ఎందుకు ఆపాడు? బ్రహ్మాం, భారతీల ఎఫైర్‌ ఎక్కడకు దారి తీసింది? శంకర్‌, విష్ణు కలిసి బ్రహ్మాను ఏం చేశారు? చివరకు ఈ ముగ్గురి ప్రేమ కథలకు ఎలాంటి ముగింపు పడింది అనేదే తురుమ్ ఖాన్ లు.

సినిమా ఓట్ లైనే ఇంత కామెడీగా ఉందంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. థియేటర్ లలో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎక్కువమందికి రీచ్ కాలేదు. యాక్టర్స్ కొంత వారే కావడంతో రీచ్ తగ్గిందేమో కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న తీరు ఇండస్ట్రీనే ఆశ్చర్యపరుస్తుంది. సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఎన్‌ శివ కల్యాణ్‌ కు మంచి మార్కులే పడుతున్నాయి. పల్లెల్లో ఉండే ఒరిజినల్ కామెడీని అందరికీ కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు దర్శకుడు. అలాగే అందరూ టెక్నిషన్స్, యాక్టర్లు కూడా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా దేవరాజ్ పాలమూర్ చేసే కామెడీ బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన డైలాగ్ మాడ్యూలేషన్ విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది.

మొత్తం తురుమ్ ఖాన్ సినిమా విషయంలో నిర్మాతకే ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారు. అందరి కొంతవారితో ఇలాంటి సినిమా నిర్మించిన నిర్మాత ఎండీ అసిఫ్‌ జానీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మంచి సినిమా కచ్చితంగా నిలబడుతుందనే నమ్మకంతో ఎండీ అసిఫ్‌ జానీ ఇన్నాళ్లు సరైన ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూశారు. ఇప్పుడు ఆహా వేదికగా స్ట్రీమింగ్ కావడం, సినిమాకు మిలియన్ల వ్యూస్ తో పాటు, సూపర్ హిట్ టాక్ రావడంతో నిర్మాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని, పరిశ్రమలో కొత్తవారిని ప్రోత్సహించాలనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు. తురుమ్ ఖాన్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలో మరో అద్భతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

చిత్రం: తురుమ్‌ ఖాన్‌లు
నటీనటులు:నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
నిర్మాత: ఎండీ అసిఫ్‌ జానీ
బ్యానర్ : స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సహా-నిర్మాత : కే. కళ్యాణ్ రావు
రచన-దర్శకత్వం: ఎన్‌ శివ కల్యాణ్‌
సంగీతం: వినోద్‌ యాజమాన్య, అఖిలేష్‌ గోగు రియాన్‌
సినిమాటోగ్రఫీ: అంబటి చరణ్‌
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ప్రొడక్షన్ డిజైనర్: రజనీకాంత్
పీఆర్ఓ: హరీష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago