టాలీవుడ్

“క” సినిమాలో థ్రిల్లింగ్ కంటెంట్ చూస్తారు -హీరో కిరణ్ అబ్బవరం

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో “క” సినిమా హైలైట్స్ తో పాటు ఈ చిత్రంలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరో కిరణ్ అబ్బవరం.

  • మా “క” సినిమాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ వస్తోంది అందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. క సినిమా టైటిల్ జస్టిఫికేషన్ నా పేరు కాదు టైటిల్ అలా కుదిరింది. క ఏంటి, ఈ మూవీ కథ ఏంటి అనేది మీకు మూవీ క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. దర్శకులు సందీప్, సుజీత్ ఈ కథ చెప్పినప్పుడు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనేది ఊహించలేకపోయాను. నేను ఇలా జరుగుతుందేమో అనుకుంటే మరో ట్విస్ట్ వచ్చింది. ఇలాంటి పాయింట్ తో 70వ దశకం నేపథ్యంలో కొత్తగా మూవీ ప్లాన్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగింది. దర్శకులు చెప్పిన షాట్ మేకింగ్ కూడా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు ఈ కథను తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మాం.
  • క మూవీ క్లైమాక్స్ ను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాం. ఇలాంటి క్లైమాక్స్ తో ఇంతవరకు మూవీ రాలేదు. అందుకే కొత్తదనం మీరు ఫీల్ కాకుంటే నేను సినిమాలు చేయను అనే బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాను. చాలామంది కాంతార, విరూపాక్ష మూవీస్ తో క సినిమాను పోలుస్తున్నారు. కానీ అలా ఏమాత్రం ఉండదు. ఇదంతా సైకలాజికల్ గా వెళ్తుంది. డివోషనల్ పాయింట్స్ ఉండవు. ఎవరు ఏంటి ఎక్కడ అనే సస్పెన్స్ తో మూవీ సాగుతుంది. ప్రతిసారీ ఎవరు ఏంటి ఎక్కడ అనే మూడు పాయింట్స్ ప్రేక్షకుల్ని ట్రిగ్గర్ చేస్తుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్లు ట్విస్ట్ లు సోషల్ మీడియా ద్వారా రివీల్ చేస్తారేమో అనే భయం మాలో ఉంది. అయితే మీడియా ఫ్రెండ్స్ అంతా ట్విస్ట్ లు బాగున్నాయని పాజిటివ్ రివ్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాం.
  • దర్శకులు సందీప్ , సుజీత్ కథ చెప్పినప్పుడే వాసుదేవ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనే క్లారిటీకి వచ్చాను. 1977లో కృష్ణగిరి అనే ఊరిలో ఉండే అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ లో నేను నటించాను. ఊరి నుంచి వచ్చాను కాబట్టి కృష్ణ గిరి అనే ఊరు నేపథ్యంతో దర్శకులు చెప్పిన ఈ కథను త్వరగా రిలేట్ చేసుకోగలిగాను. నాకు తెలిసి ఊర్లలో ఉత్తరాలు పంచే హీరో క్యారెక్టర్ ఇటీవల రాలేదు. అభినయ వాసుదేవ్ క్యారెక్టర్ కోసం నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఆ కాలంలో వాళ్లు ఎలా మాట్లాడతారు. ఊర్లో వాళ్లతో ఎలా కలిసిపోతారు. అనేది తెలుసుకున్నాను.
  • ఈ సినిమా క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఎద్దుల బండి మీద చేసే ఫైట్స్, అలాగే ఇంటి పై కప్పుల మీద పరుగులు పెట్టేవి….ఈ యాక్షన్స్ సీన్స్ రియలెస్టిక్ గా వచ్చేందుకు చాలా కష్టపడ్డాం. ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యాం. షూటింగ్ చేసినప్పుడు ఒళ్లంతా దుమ్ముతో నిండిపోయేది. క సినిమా విషయంలో ఫిజికల్ గా కష్టపడింది ఈ యాక్షన్ సీక్వెన్సులకే. క సినిమా థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం చేశాం. ట్రైలర్ లో కథ రివీల్ కాకూడదనే ఎక్కువ పాత్రలను చూపించలేదు.
  • నా గత రెండు చిత్రాల విషయంలో ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. క సినిమా కంటెంట్ ట్రీట్ మెంట్ కొత్తగా ఉంటుంది. అందుకే పదే పదే మా మూవీ ఫ్రెష్ గా ఉంటుందని చెబుతున్నాం. స్క్రీన్ మీద సినిమా చూస్తున్న ప్రేక్షకుడు వీళ్లు కొత్తగా ప్రయత్నించారు అనే ఫీల్ అవుతారు. రస్టిక్ గా మూవీ ఉంటుంది. ఫైట్స్, పాటలు ఉంటాయి. క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేశాం. అది జెన్యూన్ గా ప్రేక్షకులకు రీచ్ అవుతుందని నమ్ముతున్నాం.
  • మనం అనుకున్న కథ ఏదో ఒక భాషలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి రెస్పాన్స్ బాగుంటే ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. పాన్ ఇండియా రిలీజ్ లో కలిసొచ్చే అంశమిది. మా మూవీని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాం. తమిళంలో వాళ్ల సినిమాలు రిలీజ్ వల్ల థియేటర్స్ దొరకలేదు. మనసులో బాధగా ఉన్నా, ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేశాం. మలయాళంలో దుల్కర్ గారి లక్కీ భాస్కర్ సేమ్ డేట్ కు రిలీజ్ అవుతోంది. దుల్కర్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం వల్ల మలయాళంలో క రిలీజ్ అదే రోజు వద్దనుకున్నాం.
  • దర్శకులు సుజీత్, సందీప్ క మూవీకి డెడికేటెడ్ గా వర్క్ చేశారు. వాళ్లు వర్క్ విషయంలో చాలా క్లారిటీతో ఉండేవారు. సెట్ కు వచ్చేప్పుడే ఏం చేయాలో ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా పనులు వాళ్లు షేర్ చేసుకుని చేస్తున్నారు. వాళ్లిద్దరితో చాలా కంఫర్ట్ గా వర్క్ చేశాను. ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకోకుండా కొత్తగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు.
  • మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తన్వీరామ్, నయన్ సారిక ఉన్నారు. వాళ్లిద్దరివీ కీలకమైన పాత్రలే. రాధ పాత్రలో తన్వీరామ్ చేసింది. తను చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. రాధ పాత్ర ద్వారా మా క్యారెక్టర్స్ రివీల్ అవుతుంటాయి. నయన్ సారిక సత్యభామ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. తను అభినయ వాసుదేవ్ లవ్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది.
  • నాగ చైతన్య గారు మా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ ఏడాది నా మ్యారేజ్ జరిగింది. క సినిమా రిలీజ్ కు వస్తోంది. నా ఫిల్మోగ్రఫీలో ఒక మంచి మూవీగా క నిలుస్తుంది. గత కొద్ది రోజులుగా క మూవీ రిలీజ్ హడావుడిలోనే ఉన్నాను. ఇంట్లో కూడా టైమ్ స్పెండ్ చేయడం లేదు. క సినిమా గ్రాండ్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటా. కొంత టైమ్ తీసుకుని నెక్ట్ మూవీ ప్లాన్ చేస్తాను.
Tfja Team

Recent Posts

సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్…

17 hours ago

Dance IKON Season 2 turns into revenge-fueled battle as nominations heat up

HYDERABAD – The second episode of Dance IKON Season 2: Wildfire delivered an unexpected twist,…

17 hours ago

హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అందెల రవమిది” సినిమా టీజర్ రిలీజ్

ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. ఈ చిత్రాన్ని శివ భట్టిప్రోలు సమర్పణలో…

17 hours ago

దిల్ రాజు చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘రెడ్డి మామ’ అంటూ సాగే మాస్ సాంగ్ విడుదల

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…

22 hours ago

Dil Raju Launched Mass Folk Song From Barabar Premistha

Attitude Star Chandra Hass is coming up with a rustic love and action entertainer Barabar…

22 hours ago

Melody Song ‘O Prema Prema’ Released from “Artiste”

Santhosh Kalwacherla and Krisheka Patel play the lead roles in "Artiste", which is produced by…

22 hours ago