మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రారంభమైన YO! 10 ప్రేమకథలు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో “YO! 10 ప్రేమకథలు” సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. “YO! 10 ప్రేమకథలు” చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. మనోహర్ చిమ్మని మంచి దర్శకుడు, ప్రతిభగల రచయిత. ఆయన గతంలో “కల”, “అలా”, “వెల్కమ్” , “స్విమ్మింగ్ ఫూల్” వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని రాసి 1998లో నంది పురస్కారం గెల్చుకున్నారు. తాజాగా “YO! 10 ప్రేమకథలు” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్ పై క్లాప్ కొట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో

డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ – మనోహర్ చిమ్మని దర్శకుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకానికి నంది పురస్కారం దక్కింది. దర్శకుడిగా “YO! 10 ప్రేమకథలు” సినిమాతో మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి మంచి పాటలు చేసుకునే వీలు ఉంటుంది. మనోహర్ గారితో పాటు మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ చంద్రమహేశ్ మాట్లాడుతూ – “YO! 10 ప్రేమకథలు” టైటిల్ చాలా బాగుంది. ఈ కథలో పది ప్రేమ కథల్ని చూపించబోతున్నారు దర్శకుడు మనోహర్ చిమ్మని. ఆ ప్రేమ కథలన్నీ జెన్యూన్ గా ఉంటాయని ఆశిస్తున్నా. ఈ సినిమా మనోహర్ గారికి దర్శకుడిగా మరింత మంచి పేరు తీసుకురావాలి. టీమ్ అందరికీ నా విశెస్ అందిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ బాబ్జీ మాట్లాడుతూ – తన కొత్త మూవీ ప్రారంభించుకుంటున్న డైరెక్టర్ మనోహర్ కు నా శుభాకాంక్షలు. ఇండస్ట్రీలో కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని గ్రంథస్తం చేసి ముందు తరాలకు అందించే ప్రయత్నం చేశారు మనోహర్. సినిమాలో ఒక ప్రేమ కథ ఉంటుంది. కానీ “YO! 10 ప్రేమకథలు” సినిమాలో పది ప్రేమ కథల్ని ఆయన తెరకెక్కించబోతుండటం ఆసక్తికరంగా ఉంది. సినిమా టీమ్ అందరికీ నా విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.

దర్శకురాలు ప్రియదర్శిని మాట్లాడుతూ – మనోహర్ గారు నాకు దర్శకుడిగా కంటే రచయితగా చాలా ఇష్టం. ఆయన రచనా శైలి ఆకట్టుకునేలా ఉంటుంది. “YO! 10 ప్రేమకథలు” సినిమాతో ఆయన దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

చిత్ర దర్శకులు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ – యో… అనే మాట యువతకు ప్రతీక. ఈతరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన 10 ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. సుమారు 2 గంటల నిడివి ఉండే ఈ సినిమాలో 10 జంటలుంటాయి. 10 ప్రేమకథలుంటాయి. ఒక్కో ప్రేమకథ ఒక్కో జానర్లో ఉంటుంది. అయితే – ఈ ప్రేమకథలన్నింటికీ లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఆ లక్ష్యమే ఈ సినిమాను యువతరం ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది, యూత్‌ఫుల్‌గా ఆలోచించే అన్ని వయస్సులవారికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో పది మంది పాపులర్ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్‌లో కొందరు పాపులర్ సహనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ నటిస్తున్నారు. ఈ వివరాలన్నీ తర్వాత ప్రకటిస్తాము. సినిమా షూటింగ్ నవంబర్ చివరివారం నుంచి ప్రారంభిస్తున్నాము. వైజాగ్, గోవా, హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన ఇండోర్ అండ్ అవుట్‌డోర్ లొకేషన్స్‌లో షూట్ చెయ్యబోతున్నాం. ఈ ప్రారంభ వేడుకలో మీరు చూసిన ఇంట్రో వీడియో, ఈ సినిమా పోస్టర్ డిజైనింగ్‌ను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి చేశాం. ఈ సినిమాలోని ఇంక చాలా అంశాల్లో ఏ ఐ ని ఉపయోగిస్తున్నాం. అన్నారు.

టెక్నికల్ టీమ్

డిఓపి: వీరేంద్ర లలిత్
సంగీతం: ప్రదీప్‌చంద్ర
ఎడిటింగ్: నాగిరెడ్డి
నిర్మాణం: మనూటైమ్ మూవీ మిషన్, పి సి క్రియేషన్స్
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: మనోహర్ చిమ్మని

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago