తిరువీర్, ఐశ్వర్య రాజేష్, భరత్ దర్శన్, మహేశ్వర రెడ్డి మూలి, గంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 2 గ్రాండ్ గా లాంచ్

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన నెక్స్ట్  ప్రాజెక్ట్ ను ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మిస్తున్నారు.

తమ ఫస్ట్ ప్రొడక్షన్ శివమ్ భజేతో ప్రేక్షకులని అలరించిన గంగాఎంటర్‌టైన్‌మెంట్స్, మరో ఎక్సయిటింగ్ కథతో వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్, మసూద నుంచి ప్రీ వెడ్డింగ్ షో వరకు డిఫరెంట్ జానర్లలో ఆకట్టుకున్నారు. ఈ కొత్త సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.

ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.

ఈ నెల 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీతం: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్స్: పూర్ణాచారి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago