హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేసిన ‘ప్రేమంటే’ వెడ్డింగ్ సాంగ్ ‘పెళ్లి షురూ’

ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.

పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత.  

ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.  మనుసుని హత్తుకునే ప్రేమకథపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.

ఈ రోజు చిత్రంలోని రెండో పాట ‘పెళ్లి షురు’ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేశారు.

ఇది ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి సాంగ్. హీరో–హీరోయిన్ల వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని మెలోడీ లియాన్ జేమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే మనసును కట్టిపడేస్తుంది.

శ్రీమణి రాసిన సాహిత్యం, కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న జంట భావోద్వేగాలను చక్కగా ప్రజెంట్ చేసింది. చాలా రోజుల తరువాత తెలుగు పాటకు వాయిస్ అందించిన శ్రేయా ఘోషాల్ తన మధురమైన  వోకల్స్ పాటకు కొత్త అందాన్ని తెచ్చారు. హిందీలో కుబేరా సినిమాకు హిట్ పాటలు పాడిన దీపక్ బ్లూ తన ఎనర్జిటిక్  వాయిస్ కలసి ఈ ట్రాక్‌ను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

విజువల్ గా పాట అద్భుతంగా వుంది.  కాంతులతో, నవ్వులతో, సంతోషంతో నిండిన వివాహ వాతావరణం తెరపై కలర్ పుల్ గా కనిపిస్తోంది.

ప్రియదర్శి, ఆనంది ఇద్దరూ బ్యుతీఫుల్ డ్యాన్స్ మూవ్స్ తో పాటకు జీవం పోశారు. ఈ పాట తెలుగు పెళ్లిళ్లలో మస్ట్ ప్లే సాంగ్‌గా మారబోతోంది.

ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది.గామి సినిమాకి గానూ గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి డీవోపీగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్‌ను రాఘవేంద్ర తిరున్ పర్యవేక్షిస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ ములే. కార్తీక్ తుపురాని,  రాజ్‌కుమార్ డైలాగ్స్ రాశారు.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
డైలాగ్స్: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్
మ్యూజిక్ ఆన్: సరిగమ

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago