ఆహా’లో ఆగ‌స్ట్ 25న మూవీ ‘బేబి’ సినిమా చూసే అవ‌కాశం

ఆహా’లో ఆగ‌స్ట్ 25న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘బేబి’ స్ట్రీమింగ్‌.. ఎక్స్‌క్లూజివ్‌గా 12 గంట‌లు ముందుగానే గోల్డ్ స‌బ్ స్క్రైబ‌ర్స్ సినిమా చూసే అవ‌కాశం

ఆగ‌స్ట్ 18, హైద‌రాబాద్‌:  తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకెళ్తోన్నఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇప్ప‌టికే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను అందించిన ఆహా తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బేబి’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో ఆగ‌స్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే క‌ల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాల పొందిన ‘బేబి’ చిత్రం త్వ‌ర‌లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌టానికి ప‌రుగులు తీస్తోంది. ఈ నేప‌థ్యంలో రూ.899లను చెల్లించిన త‌న గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు మ‌రో అపూర్వ అవ‌కాశాన్ని అందించింది ఆహా. ఈ గోల్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ ఇప్పుడు ఏకంగా 12 గంట‌లు ముందుగానే బేబి సినిమాను చూడ‌బోతున్నారు.

ఈ గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ తీసుకున్న వారు సినిమాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను చూసేట‌ప్పుడు 4K డాల్బీ ఆడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు. ఈ స‌దుపాయం ఇటు తెలుగు, అటు త‌మిళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోని స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అందుబాటులో ఉంది. ఆహా స‌బ్ స్క్రిప్ష‌న్‌లో చాలా మార్పులను చేసింది. దీని కార‌ణంగా ఎస్‌వీఓడీ (స‌బ్ స్క్రిప్ష‌న్ వీడియో ఆన్ డిమాండ్‌)లో చాలా గొప్పగా నెంబ‌ర్స్ న‌మోదు అయ్యాయి. ఆహా తెలుగు ఆడియెన్స్ కోసం స‌బ్ స్క్రిప్ష‌న్ వివ‌రాలు

* రూ. 699ల‌కు ఏడాది పాటు ఎలాంటి యాడ్స్ లేని ప్యాక్ ల‌భ్యం
* రూ. 399ల‌కు ఏడాది పాటు యాడ్స్‌తో కూడిన ప్యాక్ ల‌భ్యం
* రూ. 199ల‌కు మూడు నెలల పాటు యాడ్స్‌తోకూడిన‌ ప్యాక్ ల‌భ్యం
* రూ.99 ల ప్యాకేజీ యాడ్స్‌కూడింది. ఇది కేవ‌లం మొబైల్ యూజ‌ర్స్‌కు మాత్ర‌మే.

ఈ సంద‌ర్భంగా ఆహా వైస్ ప్రెసిడెంట్‌, బిజినెస్ స్ట్రాట‌జీ,  ఎస్‌వీఓడీ హెడ్ రాకేష్ సీకే మాట్లాడుతూ  ‘‘ప్రేక్షకులకు అత్యంత నాణ్యతతో కూడిన నిరంతర వినోదాన్ని అందించాలనే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వారికి మరింత స్థిరమైన వినోదాన్ని మరిన్ని ఫీచర్స్ కలిపి అందించాలనే ఉద్దేశంతో సబ్ స్క్రిప్షన్ ప్యాక్ ధరలలో కొన్ని మార్పులు చేయటం జరిగింది”

సామజవరగమన, హిడింబ వంటి సినిమాలతో ఆహా తన యూజర్లను అలరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లెటెస్ట్ సెన్సేషనల్ కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి సినిమా ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమాను ఎస్ కే ఎన్ (శ్రీనివాస్ కుమార్ నాయుడు) నిర్మించగా.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.

ఆహా వేదిక మీద బేబి చిత్రం ప్రదర్శితం కానుంది. థియేటర్లో ఆల్రెడీ ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉంది. ఆహా ఫ్లాట్ ఫాంపై బేబి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహాలోని కంటెంట్ ప్రతీ ఏజ్ గ్రూప్ ఆడియెన్స్, క్లాస్ మాస్ ప్రేక్షకులన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తూ ఉంటుంది.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago