తగ్గేదే లే’ ట్రైలర్.. విడుదల చేసిన హీరో నిఖిల్

ఓ అమ్మాయిని ఎవరో దారుంగా చంపేసుంటారు. ..ఆ హత్యను ఎవరు చేశారని పోలీస్ ఆఫీసర్స్ దర్యాప్తు చేస్తుంటారు. నవీన్ చంద్రను అనుమానిస్తుంటారు. మరో వైపు ఓ హంతకులు ముఠా … హత్యలు చేయటానికి పథకాలు రచిస్తుంటుంది. అసలు చనిపోయిన అమ్మాయి ఎవరు? హంతకుల  ముఠాకి, నవీన్ చంద్రకు ఏంటి సంబంధం? అనే విషయం తెలుసుకోవాలంటే ‘తగ్గేదే లే’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నిఖిల్ విడుదల చేసి ఎంటైర్ టీమ్‌కి అభినందనలు తెలిపారు.సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ఇంట్రెస్టింగ్ టీజ‌ర్‌, నైనా గంగూలీ నర్తించిన స్పెషల్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్.. చరణ్ అర్జున్ మ్యూజిక్ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే, మ‌క‌రంద్ దేశ్ పాండే, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, పూజా గాంధీ, రాజా ర‌వీంద్ర‌, ర‌వి శంక‌ర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago