‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ త్వరలో ట్రైలర్ విడుదల

వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక ప్రధాన మరియు ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.

ప్రపంచం లోనే మొదటి సారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్ తో హన్సిక నటించగా తీసిన సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగు లో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది.

సింగిల్ క్యారక్టర్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాత్రకు హన్సిక యాప్ట్. ఆవిడ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. చిత్రం అంతా సింగిల్ షాట్ లో కేవలం తన పాత్ర మీదే నడిచే సినిమా కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం చిత్రాన్ని తనే క్యారీ చేయాలి. తను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించింది. హన్సిక కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.

సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుంది. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణం. దర్శకులు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడే ఆయన ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చేసిన బిజీఎం సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సినిమా చూస్తున్నంత సేపు పాత్రతో పాటూ మనం ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సామ్ తన మ్యూజిక్ తో ఆద్యంతం టెన్షన్ నీ క్రియేట్ చేశారు. బ్రహ్మ కడలి గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా కుదిరింది. ఆయన పనితనం అడుగడుగునా కనిపిస్తుంది.

సింగిల్ షాట్ తో రన్ అయ్యే సినిమా కావడంతో అనుకున్న షేడ్ రావడం కోసం కెమెరామన్ కిషోర్ బోయిదాపు లైటింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా కొత్తగా ప్రయత్నించారు. ఆయన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కి అనుగుణంగా ఒక పర్ఫెక్ట్ సింక్ లో ఉండేలా చూసుకున్నారు. ఇక దర్శకులు రాజు దుస్సా గారు తను ఈ సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో సాగే స్టొరీ నీ నెరెట్ చేసిన దానికంటే బెటర్ గా తెరపైకి తీసుకురాగలిగారు. ప్రతి ఫ్రేమ్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సెకండ్ కథతో లింక్ అయ్యి ముందుకు నడిపిస్తుంది. అంత పర్జెక్ట్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశారు ఆయన.

అందరూ ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్ గా చేయడంతో చిత్రం చాలా బాగా వచ్చింది. దేశంలోనే తొలిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో అతి తక్కువ డైలాగులతో తెరకెక్కిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనకి ఉన్న ప్యాషన్ వల్ల చిత్రం ఔట్ పుట్ లావిష్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కింది. చిత్ర బృందం త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

టైటిల్ : వన్ నాట్ ఫైవ్ మినిట్స్
జానర్ : సైకలాజికల్ థ్రిల్లర్
హన్సిక మోత్వాని నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
పోస్టర్ డిజైనర్ : సుధీర్ దొమ్మేటి
వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : ఫణి విహారి గంటల
డి ఐ & కలరిస్ట్ : బి వి ఆర్ శివకుమార్
మేకప్ మాన్ : డెక్క బాలు
స్టంట్ మాస్టర్ : మల్లి
స్టిల్స్ : గుణకర్
ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ : అట్లూరి సురేష్ బాబు
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ & స్క్రిప్ట్ చీఫ్ అసోసియేట్ : రూప కిరణ్ గంజి
ఎస్ ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : జైసన్ జోస్
పిఆర్ఓ : బి ఎ రాజు’s టీం
ఎడిటర్ : శ్యామ్ వడవల్లి
ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి
డి ఓ పి : కిషోర్ బోయిదాపు
మ్యూజిక్ : సామ్ సి ఎస్
కో ప్రొడ్యూసర్ : బొమ్మక్ యషిత
ప్రొడ్యూసర్ : బొమ్మక్ శివ
రచన & దర్శకత్వం : రాజు దుస్సా

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

7 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago