దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు.
ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఆయన ఖ్యాతిని పెంచింది. సార్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి, ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. ఆయన తదుపరి సినిమా కోసం సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)ని కూడా వారే నిర్మించడం విశేషం. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి మరో విభిన్న కథాంశంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
‘నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’గా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఇది సినిమా ప్రేమికులకు థియేటర్‌లలో గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమవుతుందని మేకర్స్ పేర్కొన్నారు.
జాతీయ అవార్డు గ్రహీత, సార్(వాతి)కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: వినీష్ బంగ్లాన్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…