‘జనక అయితే గనక’ నుంచి లిరికల్ సాంగ్ ‘నువ్వే నాకు లోకం…’ రిలీజ్

‘ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే..
వింటావా నా మాట‌నే ఉండిపోవే ఉండిపోవే..
మ‌న‌సే ఇరుకై నలిగా నేనే
గ‌దిలో నువ్వు లేక‌
నిదుర కుదురు చెదిరిపోయే
నువ్విలా వ‌దిలాక‌’

అంటూ దూరమైన భార్యపై తన ప్రేమను వ్యక్తం చేస్తున్న భర్త మనసులోని బాధ, ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే ‘జనక అయితే గనక..’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.  సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు.  ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్నారు.

బ‌లగం వంటి ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను అందించిన దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ నుంచి మ‌రోసారి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామాగా ‘జనక అయితే గనక’ విడుదలవుతుంది.  ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నువ్వే నాకు లోకం…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను కృష్ణ‌కాంత్ రాయ‌గా.. కార్తీక్ పాడారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago