‘కాంత’కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. టాప్ క్లాస్ సినిమా తీసినందుకు ప్రౌడ్ గా ఉంది: ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి

Must Read

దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రెట్రో బ్లాక్ బస్టర్ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14 విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. కాంత సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ గారి కెరీర్ ఫైనస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ వున్నా సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. జోనర్ బెండింగ్ సినిమా గా వచ్చిన ఫస్ట్ ఫిలిమ్ కాంత . ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. మద్రాస్ నేపథ్యంలో జరిగే కథ కావడం, ఎలాంటి అంచనా లేకుండా చూడటంతో మద్రాస్ ఆడియన్స్ ఇంకా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు.

అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు రానా, భాగ్యశ్రీ సమాధానాలు ఇచ్చారు.

రానా గారు ఈ సినిమాని మీరు దుల్కర్ గారు నిర్మించడానికి కారణం ?
-నాకు కొలాబరేషన్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఆర్టిస్టులు రెండు కంపెనీలు ఒకచోట కలిసినప్పుడు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇండిపెండెంట్ ఆర్ట్ సినిమా నాకు దుల్కర్ గారికి ఇద్దరికి ఇష్టం. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది.

-చాలా గ్యాప్ తర్వాత నేను స్క్రీన్ మీద కనిపించాను. నా క్యారెక్టర్ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది.

  • దుల్కర్ అమేజింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బేసిగ్గా హీరో అంటే ఇన్ సెక్యూర్ అవ్వకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ దుల్కర్ ఆ ఎమోషన్ ని చాలా అద్భుతంగా ప్రదర్శించారు.

-భాగ్యశ్రీ క్యారెక్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తనకి బిగ్ కంగ్రాజులేషన్స్.

రానా గారు ఈ సినిమా సెట్స్ దానికోసం ఎలాంటి రీసెట్ చేశారు?
-చాలావరకు రిఫరెన్సులు వాహిని స్టూడియోస్ ఏవీఎం స్టూడియోస్ నుంచి చాలా వరకు రిఫరెన్స్ లు తీసుకున్నాం. ఆ టైంలో సెట్లు ఎలా చేసేవారు అనేది ప్రతిదీ డీటైలింగ్ గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ సెల్వ ప్రతి విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు. డాని ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ ల చూపించాడు.

ఇది బయోపిక్ కాదు అన్నారు.. మరి ఎంజీఆర్, ఎంఆర్ రాజా లాంటి ప్రముఖ నటుల్ని ఎందుకు చూపించారు?
-ఇది ఆ టైం కి సంబంధించిన కథ. దానికి రిలవెంట్ గా ఉంటుందని అలా చూపించడం జరిగింది. 50, 60 దశకాల్లో నుంచి తీసుకున్న సినిమాల రిఫరెన్స్ లు ఇందులో చూపించడం జరిగింది.

భాగ్యశ్రీ గారు… ఇది మీ ఫస్ట్ తమిళ్ సినిమా కదా.. ఆ భాషలో పెర్ఫార్మ్ చేయడం ఎలా అనిపించింది?
-ముందుగా ఈ సినిమా అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అంత మంచి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా 100% ఇవ్వాలి. డైరెక్టర్ సెల్వ గారి సపోర్ట్ తో ప్రతి లైన్ ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. naa పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆరు నెలలు చెన్నైలోనే ఉన్నాను.

  • ఈ సినిమా కోసం సావిత్రి గారు శ్రీదేవి గారు చేసిన చాలా సినిమాలు చూశాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. అందులోనూ పాత సినిమాలు ఇంకా ఇష్టం. అవన్నీ కూడా దీనికి ఉపయోగపడ్డాయి
  • తమిళ్లో తెలుగులో రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్ ని నేను ఊహించలేదు

రానా గారు ఇందులో మీ క్యారెక్టర్ కోసం ఏదైనా రిఫరెన్స్ ఉందా?
-లేదండి. డైరెక్టర్ సెల్వ కి ఒక పర్టికులర్ విజన్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి? తను ముందే అనుకున్నాడు. నాకు అక్కడ ఉన్న ఏ పాత్ర మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు. ఈ అలాగే ఉండాలని తన ముందే ఫిక్స్ అయ్యాడు.

మీరు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకపోవడానికి కారణం? .
-నేను మొదటి నుంచి ఒక విభిన్నమైన దారిని ఎంచుకున్నాను.నేను చూడని సినిమా ఇవ్వాలనే ఉంటుంది. అది నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది

భాగ్యశ్రీ గారు వరుసగా రెండు వారాల్లో మీరు వచ్చి రెండు సినిమాలు వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది?
-చాలా హ్యాపీ. కాంత రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చింది. రెండు డిఫరెంట్ సినిమాలు. ఈ రెండిటి నేపథ్యం సినిమా అయినప్పటికీ కథపరంగా దేనికవి ప్రత్యేకమైన సినిమాలు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News