తమిళంలో 2023న విడుదలై విజయవంతమైన బంపర్ సినిమా తెలుగులో రాబోతుంది. బంపర్ అనే టైటిల్ కేరళ లాటరీ నేపథ్యంగా రూపొందింది. బంపర్ చిత్రంలో వెట్రి, శివాని నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించగా, హరీష్ పేరడి, జి. పి. ముత్తు, తంగదురై, కవితా భారతి సహాయక పాత్రలు పోషించారు. M. సెల్వకుమార్ రచన, దర్శకత్వం వహించబడిన ఈ చిత్రం థ్రిల్లర్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా పేరుతెచ్చుకుంది.
ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ, టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. స్నేహితులతో కలిసి అయ్యప్పమాల వేసుకుని కేరళ వెళ్ళిన ఓ యువకుడికి అక్కడ కొన్న లాటరీ టిక్కెట్ కు ప్రైజ్ మనీ వస్తుంది. దాన్ని చేజిక్కించుకునేందుకు అతను పడ్డ కష్టాలు, స్నేహితులతో ఇబ్బందులు అనేవి ఎంటర్ టైన్ మెంట్ లో చూపిస్తూ ఓ థ్రిల్లర్ అంశాన్ని జోడించిన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేపుతూ ప్రేక్షకులను ఆకర్షించింది.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో తెలుగులో విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించిందనీ, తెలుగులో కూడా ఆదరణ పొందుతుందనే విశ్వాసాన్ని నటీనటులు వ్యక్తం చేశారు.
ఈ చిత్రాన్ని తూత్తుకుడి, పునలూర్, తిరువనంతపురం, ఎరుమేలి, శబరిమలలో చిత్రీకరించారు.
తారాగణం: పులి పాండిగా వెట్రి, శివాని నారాయణన్, హరీష్ పేరడి, G. P. ముత్తు, తంగదురై, కవితా భారతి, దిలీప్ అలెగ్జాండర్
ఈ చిత్రం ద్వారా ఎం. సెల్వకుమార్కు దర్శకుడిగా పరిచయం అవ్వగా, వేధా పిక్చర్స్ బ్యానర్పై ఎస్.త్యాగరాజా, టి.ఆనందజోతి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ వినోద్రథినాసామి అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్: కాశివిశ్వనాథన్.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…