పిజ్జా సినిమాకు పన్నెండేళ్ళు…

Must Read

విజయ్ సేతుపతి హీరోగా మారిన పిజ్జా తెలుగులో రిలీజ్ అయి పన్నెండేళ్ళు పూర్తయింది. “ప్రేమిస్తే”,”షాపింగ్ మాల్” మరియు “జర్నీ” వంటి పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి పిజ్జా సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్ర బ్యానర్ మీద సమర్పిస్తూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన “పిజ్జా” చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం అప్పట్లో దాదాపు 40 మంది నిర్మాతలు పోటీ పాడగా సురేష్ కొండేటి ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రం తమిళంలో లానే అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ విజయం సాధించింది. సురేష్ కొండేటి నిర్మాతగా సమన్య రెడ్డి కో ప్రొడ్యూసర్ గా ఈ సినిమాను అందించారు. అక్టోబర్ 19న పన్నెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేసిన తరువాత విజయ్ సేతుపతి పిజ్జా తరువాత ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నెగిటివ్ రోల్స్ లోనూ అదరగొడుతున్నాడు సేతుపతి. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇప్పుడు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు విజయ్ సేతుపతి. ఇక సేతుపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి అందించిన సపోర్ట్ మర్చిపోలేనని, తన కారులోనే తిరుగుతూ ప్రమోషన్స్ చేశామని సురేష్ కొండేటి వెల్లడించారు. ఇక ఈ సినిమా డబ్బింగ్ కూడా సంతోషం స్టూడియోస్ లోనే జరిగిందని మెగా బ్రదర్ నాగబాబు, శివాజీ, ఉత్తేజ్ వంటివారు ఈ సినిమాకు తమ గాత్రదానం చేశారని ఆయన అన్నారు. ఇదంతా నిన్ననే జరిగినట్టు అనిపిస్తోందని, అప్పుడే పన్నెండేళ్ళు పూర్తయ్యాయి అంటే నమ్మలేకుండా ఉన్నానని అంటున్నారు. నేను నిర్మాతగా మారిన తొలి రోజుల్లో ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక మాట – ‘నిర్మాత అంటే ఒక మంచి కథను ప్రేక్షకుడికి చెప్పడానికి మంచి కథతో కూడిన సినిమాని ప్రేక్షకులకు చూపించడం కోసం ఎప్పుడూ వెనకాడకూడదు’ అని.

అలా నేను నా మనసుకు నచ్చిన ఒక మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలని చేసిన సినిమా ‘పిజ్జా.’ తరవాత కాలంలో ‘పిజ్జా 2’, ‘పిజ్జా 3’ తెలుగు లోకి వచ్చేలా చేసిన సినిమా ‘పిజ్జా.’ సినిమా వచ్చి నేటికి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, నటించిన నటీనటులకు, ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు, మరియు పని చేసిన సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరియు సహనిర్మాతగా వ్యవహరించిన సమన్య రెడ్డికి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఒక మంచి నటుడిగా తనని తాను నిరూపించుకుని, ప్రస్తుతం తెలుగు లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఎంత గొప్ప డైరెక్టర్ అయ్యారో మన అందరికీ తెలుసు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అన్నారు.

Latest News

Dulquer Salman on Unstoppable with NBK Season 4 this Diwali

Hyderabad, India (October 29, 2024) – Get ready for an Unstoppable Diwali celebration with the second episode of Unstoppable...

More News