సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “దక్షిణ కాళీ”. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా ఈ నెల 6న తెలుగు, తమిళ, కన్నడలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు వి సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. పాటల విడుదల అనంతరం దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ “దక్షిణ కాళీ” సినిమా పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమా కంటెంట్ చూస్తుంటే అమ్మోరు మూవీ గుర్తుకు వస్తోందని అన్నారు. అరుంధతి సినిమాలో సోనూ సూద్ లా ఈ చిత్రంలో విలన్ గా నటించిన ఆజాద్ కు పేరు రావాలని ఆయన చెప్పారు. సోనూసూద్ ను అంత రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకోలేని నిర్మాతలకు ఆజాద్ మంచి ఆప్షన్ అవుతాడని వి.సముద్ర అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ కొత్త సినిమాలు ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉందన్నారు. “దక్షిణ కాళీ” సినిమా కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది అన్నారు. అమ్మోరు సినిమాలా ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరారు. నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు. ఒక లేడీ ప్రొడ్యూసర్ ఎంతో ప్రయాసతో “దక్షిణ కాళీ” చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం. ఈ సినిమా టీమ్ అందరికీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించానని తెలిపారు. ప్రేక్షకుల్ని నిరాశపరచకుండా, వాళ్లు కోరుకునే అన్ని అంశాలతో సినిమా ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. నిర్మాత సత్యవాణి మీసాల మాట్లాడుతూ సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ దాకా అమ్మవారే మమ్మల్ని నడిపిస్తూ వచ్చారని అన్నారు. అమ్మవారి దయ వల్లే ఎక్కడా ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశామని, ఈ సినిమాను డబ్బుల కోసం చేయలేదని, కేవలం దక్షిణ కాళీ అమ్మవారి గొప్పదనం, మహిమలు తెలిపేందుకే నిర్మించామని ఆమె తెలిపారు. తమకు సపోర్ట్ చేస్తున్న సముద్ర, ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ వంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు ఆజాద్ మాట్లాడుతూ దక్షిణ కాళీ చిత్రంలో కీలక పాత్రలో నటించానని, ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇంతమంచి రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఆజాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర కంటెంట్ చూసిన వారు తనను సోనూసూద్ లా ఉన్నావని అనడం గొప్ప ప్రశంసగా తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. హీరో సుబ్బు మాట్లాడుతూ మనకు ఎన్నో గ్రామ దేవతలు, నవ దేవతలు ఉన్నారు. వారి గొప్పదనం, మహిమ ప్రేక్షకులకు తెలియాలి. అలాంటి ఉద్దేశంతోనే మా ప్రొడ్యూసర్ సత్యవాణి గారు దక్షిణకాళీ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని మీరంతా ఆదరించాలి అన్నారు. రాజేందర్ ఫిలింస్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
నటీనటులు – అర్చన, సుబ్బు, ప్రియాంక, ఆజాద్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————
ఫైట్స్ – డైనమిక్ మధు
ఎడిటింగ్ – మేనగ శ్రీను
సినిమాటోగ్రఫీ – వెంకట్
మ్యూజిక్ – ఘంటాడి కృష్ణ
కథ, నిర్మాత – సత్యవాణి మీసాల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – తోట కృష్ణ
పీఆర్ఓ – వీరబాబు
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…