కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ నటించిన ‘మాక్స్’ టీజర్‌ను మంగళవారం (జూలై 16) నాడు విడుదల చేశారు. యాక్షన్ జానర్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ మాక్స్ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
మాక్స్ పాన్-ఇండియన్ సినిమాగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాక్స్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కిచ్చా సుదీప్ చాలా కాలం తరువాత మళ్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌లో అతని డెమి-గాడ్ లుక్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. మాస్, యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకునేలా సినిమాను తీయబోతోన్నారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి తదతరులు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…