మాస్ మహారాజా రవితేజ RT4GM అనౌన్స్ మెంట్

Must Read

మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM అనౌన్స్ మెంట్

మాస్ మహారాజా రవితేజ,  బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాల్నిపూర్తి చేశారు. ఇప్పుడీ బ్లాక్ బ్లాక్ బస్టర్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ని టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోంది. ఈరోజు #RT4GM సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు.

#RT4GM కోసం యూనిక్  అండ్ పవర్ ఫుల్ కథను రాశారు గోపీచంద్ మలినేని. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో భయానక స్థితిలో వున్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్ గా వున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది.  

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించనున్నారు.  ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

మిగిలిన వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.  

తారాగణం: రవితేజ

సాంకేతిక విభాగం
 దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
 సంగీతం: ఎస్ థమన్
పీఆర్వో : వంశీ శేఖర్

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News