టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా ‘బింబిసార’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించారు. ఈ భారీ విజయం తర్వాత నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్టర్ రాజేంద్ రెడ్డితో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ రూపొందుతోన్న ‘అమిగోస్’ అనే చిత్రంలో నటిస్తోన్నారు. స్నేహితుడిని సూచించటానికి ఉపయోగించే స్పానిష్ పదం అమిగోస్‌ను టైటిల్‌గా పెట్టటం వెనుకున్న కారణమేంటా? అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన కళ్యాణ్ రామ్ లుక్, టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారనే విషయాన్ని ఆ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ఆషికా రంగనాథ్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె ఇషిక అనే రోల్‌లో కనిపించనుంది. క్యూట్ లుక్స్‌తో అషికా రంగనాథ్ ఆకట్టుకుంటుంది. ‘అమిగోస్’ నిర్మాణం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు.
ఎన్నో సెన్సేషనల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగనాథ్ నటిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా.. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ తదితరులు