పేక మేడలు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ – ‘బూమ్ బూమ్ లచ్చన్న’

‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను ‘పేక మేడలు’తో హీరోగా అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్సేన్ చేతుల మీద విడుదల చేయగా టీజర్ కు చాలా మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ బూమ్ బూమ్ లచ్చన్న విడుదలైంది.

లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ మనో గారు పాడగా లిరిక్స్ రాసింది భార్గవ్ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలైలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

Tfja Team

Recent Posts

“రణబాలి” జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను కలిసిన తమిళనాడు సీఎం, థళపతి విజయ్

తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్‌ను…

7 hours ago

‘బా బా బ్లాక్ షీప్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నెక్ట్స్ మా బ్యాన‌ర్‌లో మ‌రిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన‌ప్‌లో ఉన్నాయి – నిర్మాత వేణు దోనేపూడి

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి ద‌ర్శ‌కుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్…

22 hours ago

‘జో జో’ కాష‌న్ 1.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్న రూర‌ల్ కామెడీ డ్రామా.

కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న…

22 hours ago

అనన్య నాగళ్ల హిడి (వేర్ ది ఫీలింగ్) లాంచ్

నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…

23 hours ago

నేడే ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల*

▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్‌ హైదరాబాద్:…

1 day ago

పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు – సినీ ప్రయాణంపై ప్రశంసలు.

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…

1 day ago