టాలీవుడ్

లగ్గం చిత్రీకరణ పూర్తి / టాకీపార్ట్ పూర్తిచేసుకున్న లగ్గం

“ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అన్నారు పెద్దలు “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి” అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా నిన్నటితో లగ్గం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది.
“మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుందని” ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు. “లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథ చిత్రమని” రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఎల్.బి. శ్రీరామ్,రోహిణి, రఘు బాబు గార్ల నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్గా చెప్పారు.

పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే!!! ఒక్కో ప్రాంతంలో ఒక్కోక్క ఆచారం… ఈ లగ్గం సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారు. చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారు, బేబీ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి లగ్గం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.

నటీనటులు:
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్,రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, లక్ష్మణ్ మీసాల, సంధ్య గంధం, టి. సుగుణ ,ప్రభావతి. కంచరపాలెం రాజు, వివా రెడ్డి,ప్రభాస్ శ్రీను, సదన్న, రవి వర్మ, కిరీటి, రవి ప్రకాష్, బాషా, విజయ లక్ష్మి, తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సుభిషి ఎంటర్టైన్మెంట్స్
కథ – మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రమేశ్ చెప్పాల
నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి
కెమెరామెన్: బాల్ రెడ్డి.
సంగీతం:చరణ్ అర్జున్.
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి.
ఆర్ట్: కృష్ణ.
సాహిత్యం: కాసర్ల శ్యామ్, సంజయ్ మహేశ్ వర్మ
కొరియోగ్రఫీ: బాను,అజయ్ శివశంకర్.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago