గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది.శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో జూలై లొనే “హాంట్” అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరఫున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళకి వారి టీం కి నోటీసులు పంపి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ & హీరో నిక్షిత్ మాట్లాడుతూ “తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తర్వాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్ ని అప్ప్లే చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్ రిజెక్ట్ చేశారు, ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆమోదం చేశారు, ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు కొంతమంది సినీ పెద్దలు, అందుకోసం మా లాయర్ ద్వారా వాళ్లందరికీ నోటీసులు పంపించారు, మా టైటిల్ మాకు వచ్చే అంతవరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం” అని తెలిపారు”.
అడ్వకేట్ సురేష్ బాబు మాట్లాడుతూ “శ్రీ క్రియేషన్స్ వారి తరపున నేను వకాలత్ నామా నేను తీసుకున్నాను, వీరి వైపు న్యాయం ఉంది, నేను కూడా ఒక నిర్మాతనే, నిర్మాతల బాధలు, వారి కష్టాలు నాకు తెలుసు, ఏ నిర్మాత నష్టపోకూడదు అనేది నా కోరిక,ఒక్క సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ని వేరే ప్రొడ్యూసర్ కి ఆ టైటిల్ ని ఆమోదం చేయడం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పిదమే, అందుకోసం వారి తరపున నేను వాదిస్తున్నాను అని అన్నారు .
నిర్మాత నర్సింగ రావు మాట్లాడుతూ “మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు పోరాడుతాం, అన్యాయం జరిగిందని మేము లాయర్ ద్వారా లీగల్ గా మాట్లాడుతున్నాం, ఎంతో ఖర్చు పెట్టి, కష్టపడి మా టీం ఈ సినిమా ని తీయడం జరిగింది, ఇప్పుడు బిజినెస్ కి మాకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు .ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో తరపున తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “గత వారం మేము పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని తెలుసుకున్నాం, మాకు సపోర్ట్ గా ఇప్పుడు రెండు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తోడుగా నిలబడ్డారు,ఫిల్మ్ ఛాంబర్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉంది, అలాంటిది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తప్పును వారే తెలుసుకోవాలి, ఎవరికి అన్యాయం జరగొద్దు అనేది నా కోరిక.
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…
బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…
▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…