టాలీవుడ్

హాంట్ టైటిల్ పై వివాదం నోటీసులు పంపిన  చిత్ర బృందం

గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది.శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో జూలై లొనే “హాంట్” అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరఫున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళకి వారి టీం కి నోటీసులు పంపి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ & హీరో నిక్షిత్ మాట్లాడుతూ “తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో  మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తర్వాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్ ని అప్ప్లే చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్ రిజెక్ట్ చేశారు, ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆమోదం చేశారు,  ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు కొంతమంది సినీ పెద్దలు, అందుకోసం మా లాయర్ ద్వారా వాళ్లందరికీ నోటీసులు పంపించారు, మా టైటిల్ మాకు వచ్చే అంతవరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం” అని తెలిపారు”.

అడ్వకేట్ సురేష్ బాబు మాట్లాడుతూ “శ్రీ క్రియేషన్స్ వారి తరపున నేను వకాలత్ నామా నేను తీసుకున్నాను, వీరి వైపు న్యాయం ఉంది, నేను కూడా ఒక నిర్మాతనే, నిర్మాతల బాధలు, వారి కష్టాలు నాకు తెలుసు, ఏ నిర్మాత నష్టపోకూడదు అనేది నా కోరిక,ఒక్క సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ని వేరే ప్రొడ్యూసర్ కి ఆ టైటిల్ ని ఆమోదం చేయడం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పిదమే, అందుకోసం వారి తరపున నేను వాదిస్తున్నాను అని అన్నారు .

నిర్మాత నర్సింగ రావు మాట్లాడుతూ “మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు పోరాడుతాం, అన్యాయం జరిగిందని మేము లాయర్ ద్వారా  లీగల్ గా మాట్లాడుతున్నాం, ఎంతో ఖర్చు పెట్టి, కష్టపడి మా టీం ఈ సినిమా ని తీయడం జరిగింది, ఇప్పుడు బిజినెస్ కి మాకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు .ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో తరపున తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “గత వారం మేము పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా  ఇండస్ట్రీలో  జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని తెలుసుకున్నాం, మాకు సపోర్ట్ గా ఇప్పుడు  రెండు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తోడుగా నిలబడ్డారు,ఫిల్మ్ ఛాంబర్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉంది, అలాంటిది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్  తప్పును వారే తెలుసుకోవాలి, ఎవరికి అన్యాయం జరగొద్దు అనేది నా కోరిక.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago