బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ముఖ్య తారాగణం తో యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devil’s chair). అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ “సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి” అని కోరుకున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ “మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏ ఐ టెక్నాలజీ తో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తి అయింది. మా చిత్రాన్ని 2025 ఫిబ్రవరి చివరి వరం లో విడుదల చేస్తాము” అని తెలిపారు.
చిత్రం పేరు : ది డెవిల్స్ చైర్ (The Devil’s chair)
జానర్: హారర్ డ్రామా
రచయిత మరియు దర్శకుడు: గంగా సప్తశిఖర
నిర్మాణ సంస్థ: బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్
నిర్మాతలు: KK చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి .
ముఖ్య నటులు:
జబర్దస్త్ అభి
ఛత్రపతి శేఖర్
స్వాతి మందల్
వెంకట్ దుగ్గి రెడ్డి
చంద్ర ఎస్
మురళి సర్వన్నగారి
అద్వైత చౌదరి
సాంకేతిక నిపుణులు
సంగీతం: బిషేక్
ఎడిటింగ్ & DI: హేమంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: గంగా సప్తశిఖర
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…