తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ ‘ది టాస్క్’

Must Read

డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన ‘ది టాస్క్’ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఈ చిత్రం తెలుగులో రానుంది. జయసూర్య ఆర్.ఆజాద్, సాగర్ రామ్, శ్రీలక్ష్మి, రఘు శివమొగ్గ ప్రధాన పాత్రధారులు. రఘు శివమొగ్గ దర్శకత్వం వహించారు, కన్నడంలో ఇటీవలనే విడుదలై…అక్కడ విశేష ప్రేక్షకాదరణను చూరగొన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిశోర్ తెలుగులో విడుదల చేయనున్నారు.

గతంలో ‘తల్లి మనసు’ వంటి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం ద్వారా అభిరుచి గల నిర్మాతగా ముత్యాల అనంత కిశోర్ పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంతా కొత్త వారు నటించారని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుందన్న అభిప్రాయాన్ని ముత్యాల అనంత కిశోర్ వ్యక్తంచేశారు. మిగతా వివరాలను త్వరలో అందజేస్తామని ఆయన తెలిపారు.

Latest News

The RajaSaab Trailer 2.0

https://www.youtube.com/watch?v=kioDUhqMEKU

More News