ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ ‘కీడా కోలా’ టీజర్ విడుదలైంది. మేకర్స్ గతంలో హ్యుమరస్ పోస్టర్ల ద్వారా సినిమాలోని 8 ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.
ఒక కోలా బాటిల్ లో ఎదో కదులుతూ వుంటుంది. అది ఏంటని బ్రహ్మానందం అడిగితే? చైతన్యరావు ద్రాక్ష అని చెబుతాడు. ఇద్దరి మధ్య సెటైరికల్ పంచ్‌లతో టీజర్ హిలేరియస్ గా మొదలౌతుంది. తర్వాత గ్యాంగ్ ఆఫ్ మిస్‌ఫిట్స్ యాక్షన్ లోకి దిగడం ఇంకా ఆసక్తికరంగా వుంది. టీజర్ సినిమాలోని పాత్రలు, వారి వరల్డ్ ని పరిచయం చేసింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంటూ తర్వాత వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ పై క్యురియాసిటీని పెంచింది.
టీజర్‌లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో కనిపించగా, తరుణ్ భాస్కర్ లోకల్ డాన్‌గా కనిపించడం సర్ ప్రైజ్ చేసింది. చైతన్య రావు మాదాడి, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, రాగ్ మయూర్ ఇతర ముఖ్య తారాగణం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
కీడా కోలా విజి సైన్మా మొదటి ప్రొడక్షన్. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్. తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ రాశారు.
కీడా కోలా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
తారాగణం: బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, తరుణ్ భాస్కర్, చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్ తదితరులు
రచన & దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం
ప్రొడక్షన్ హౌస్ – విజి సైన్మ
రైటర్స్ రూమ్ – క్విక్ ఫాక్స్
నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటర్: ఉపేంద్ర వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పులాల
కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ
పీఅర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…