యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘థాంక్ యూ మీట్’ని నిర్వహించింది.
హీరో అశ్విన్ బాబు .. ‘హిడింబ’ ని పెద్ద విజయం వైపు తీసుకువెళుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో .. ఇది సాధ్యపాడుతుందా అని నేను, అనిల్ అనుకున్నాం. కానీ కొత్తదనం వుంటే మేము ఉన్నామని సినీ ప్రేక్షకులందరూ మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా వుంది. ‘హిడింబ’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి. బిజినెస్ అయ్యింది. డిస్ట్రిబ్యూట ర్స్ చాలా హ్యాపీగా వున్నారు. ఈ వర్షంలో కూడా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి సూపర్ హిట్ అని చెప్పడం ఆనందంగా వుంది. అనిల్ సుంకర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మకరంద్ దేశ్ పాండే గారు మా సినిమాలో వుండటం అనందంగా వుంది. నందిత శ్వేత, రఘు అన్న ఎంతగానో సపోర్ట్ చేశారు. మా నిర్మాత శ్రీధర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. వికాస్ బడిసా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి మంచి పేరు రావడం ఆనందంగా వుంది. కళ్యాణ్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. నేను ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫస్ట్ సీన్ ని ఎవరూ మిస్ అవ్వద్దు. అందులో స్క్రీన్ ప్లే థ్రిల్ వుంటుంది. అది మిస్ ఐతే మళ్ళీ సినిమాలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ సినిమాని బ్లెస్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ తెలిపారు.
మకరంద్ దేశ్ పాండే మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను. గొప్ప విజన్ తో ఈ సినిమాతో తీశారు. ఇలాంటి కాన్సెప్ట్ తో నటీనటులని, ప్రేక్షకులని మెప్పించడం అంత తేలిక కాదు. దయచేసిన ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు మరో పదిమందితో చెబుతారు. హిడింబ నా కెరీర్ లో అరుదైన సినిమాగా నిలిచిపోతుంది. అశ్విన్ బాబు గొప్ప ఎనర్జీతో చేశారు. అలాగే శ్వేతా తో పాటు మిగతా అందరూ చక్కగా నటించారు. టీం అందరికీ థాంక్స్. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు.
హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ.. హిడింబ అందరికీ గొప్పగా రీచ్ అయ్యింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. నిర్మాత శ్రీధర్ గారికి కృతజ్ఞతలు. వికాస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా నాకు ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత మళ్ళీ అంత మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. దర్శకుడు అనిల్ గారు నాకు చాలా పవర్ ఫుల్ రోల్ ఇచ్చారు. మకరంద్ దేశ్ పాండే గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అశ్విన్ తో వర్క్ చేయడం చాలా ఇష్టం. తను అద్భుతమైన నటుడు. తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.
దర్శకుడు అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐతే ఈ వర్షాలని తట్టుకొని మొన్న సెకెండ్ షో నుంచి మెల్లగా గ్రోత్ మొదలైయింది. రెండు రోజులకి మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాదాపు 70 శాతం బ్రేక్ ఈవెన్ లో వున్నారు. వర్షాలు లేకపోతే ఈ రోజు, రేపు బ్రేక్ ఈవెన్ స్టేజ్ కి వచ్చి అందరూ లాభపడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు బ్లడీ స్కేరీ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టాం .ఈ చిత్రంలో రక్తాన్ని భయం లేకుండా చూపించి స్కేరీ ని స్టయిలీస్ గా ప్రజంట్ చేశాం. మకరంద్ దేశ్ పాండే గారు అద్భుతంగా చేశారు. వికాస్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. మా డీవోపీ రాజశేఖర్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. కళ్యాణ్ చక్రవర్తి మంచి డైలాగ్స్ రాశారు. నిర్మాత శ్రీధర్ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా వుంది. దీనికి మా హీరో అశ్విన్ కాంట్రిబ్యుషన్ ఎంతో వుంది. అన్ని విధాలుగా ప్రోత్సహించారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో మరిన్ని సినిమాలు చేయాలి. శ్వేతా చాలా చక్కగా నటించింది. అనిల్ సుంకర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” తెలిపారు
నిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ.. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత వర్షంలో కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో భాగమైన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. ఇంత బిజీలో కూడా మా కోసం ముంబాయ్ నుంచి వచ్చిన మకరంద్ దేశ్ పాండే గారికి స్పెషల్ థాంక్స్. ఆయన దేశంలోని అత్యున్నత నటుల్లో ఒకరు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమాని ఇంకా చూడని వారు వెళ్లి థియేటర్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…