“క” సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు మూవీ టీమ్

Must Read

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లర్ సినిమాల్లో ఓ సరికొత్త ప్రయత్నంగా “క” సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు మూవీ టీమ్. ఈ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “క” సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మా మూవీకి ఎంతో సపోర్ట్ లభిస్తోంది. “క” సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్ గా చేశారు. మా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసిన వంశీ గారికి థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్స్ సుజీత్, సందీప్ సాధించిన ఈ విజయానికి వాళ్ల పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను. ఇద్దరు హీరోయిన్స్ తన్వీ రామ్, నయన్ సారిక బాగా నటించారు. “క” సినిమా బిగినింగ్, ఎండింగ్ మిస్ కావొద్దు. సినిమా చివరలోనే కథలోని ఎస్సెన్స్ ఉంది. రోలింగ్ టైటిల్స్ వరకు సినిమా చూడండి. నేను మా టీమ్ మిమ్మల్ని పర్సనల్ గా వచ్చి కలుస్తాం. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – మీ అందరికీ హ్యాపీ దీవాళి. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎన్నో భావోద్వేగాలు కలుగుతున్నాయి. “క” సినిమాకు విజయాన్నిచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. కిరణ్ గారు చెప్పినట్లు బిగినింగ్, ఎండింగ్ మిస్ కాకండి, అలాగే ఇంటర్వెల్ తో మిస్ కావొద్దు. “క” సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. అన్నారు.

హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ – “క” సినిమాకు ప్రేక్షకులు ఇస్తున్న స్పందన నేను మా టీమ్ కళ్లారా చూశాం. ప్రీమియర్ షోస్ కు వెళ్లినప్పుడు థియేటర్ లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని మా సినిమాకు ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. కిరణ్ కు మీరు ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అలాగే మా టీమ్ కు దక్కిన ఈ విజయానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సందర్భంలో ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది. అన్నారు.

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ – “క” సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. మేము నమ్మిన కథ ప్రేక్షకుల ఆదరణ రూపంలో విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త కంటెంట్ ను, కొత్త నేరేటివ్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నతీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రొడ్యూసర్ గోపి గారికి, వంశీ గారికి, కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేస్తామని మాటిస్తున్నా. అన్నారు.

  • దర్శకుడు సందీప్ మాట్లాడుతూ – కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేందుకు “క” లేటెస్ట్ ఎగ్జాంపుల్ . కొత్తగా సినిమాను చేస్తే మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. ముందు ఇలాంటి కొత్త కథను యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ రోజు మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారంటే ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడితే వారికి ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చుకునే ఇంకా మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నాం. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “క” సినిమాకు అన్ని ఏరియాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని సెంటర్స్ లో 80 పర్సెంట్ ఫుల్స్ అవుతున్నాయి. ఫస్ట్ షో, సెకండ్ షో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. నైజాంతో పాటు ఆంధ్రా, సీడెడ్ అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. 18 ప్రీమియర్స్ తో మేము స్టార్ట్ చేస్తే అది 71 షోస్ కు వెళ్లింది. ఈ 71 షోస్ లో 56 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. 8 క్లాక్ షో కు 7 గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేసినా టికెట్స్ క్లోజ్ అయ్యాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా “క” సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో ఇప్పడే చెప్పలేం అంటున్నారు. అలా నెంబర్స్ వస్తున్నాయి. కనీసం 3 వారాలు బాక్సాఫీస్ దగ్గర “క” సినిమాకు ఢోకా లేదని చెబుతున్నారు. నా కెరీర్ లోనే ఇలాంటి ది బెస్ట్ ఫిలిం ఇచ్చిన ప్రొడ్యూసర్ గోపి గారికి, హీరో కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. టికెట్స్ కోసం నాకు ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి. టికెట్స్ ఇవ్వలేనంతగా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అంత బ్లాక్ బస్టర్ సినిమా చేశాం. సినిమాకు పడిన కష్టం ఈ ఘన విజయంతో మర్చిపోతున్నాం. మా సంస్థకు ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన హీరో కిరణ్ గారికి, డైరెక్టర్స్ సుజీత్, సందీప్, డిస్ట్రిబ్యూటర్ వంశీ, ఇతర టీమ్ మెంబర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News