‘కళింగ’ను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్.

కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమాను తీయడం.. హిట్టు కొట్టడం.. హౌస్ ఫుల్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీడియా సపోర్ట్ వల్లే మా సినిమా ఇంత వరకు వచ్చింది. వారి సహకారం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. వర్డ్‌ ఆఫ మౌత్ తో మా సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది. మా సినిమాను ఇంత ఇష్టపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ నిరూపించారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ ఈ సినిమా మీద ముందు నుంచీ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది. ఆయన వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా వచ్చింది. టెక్నికల్‌గా మూవీ అద్భుతంగా వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమాను ఇంత బాగా ఆధరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా సినిమాను ఇంత బాగా ముందుకు తీసుకు వెళ్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. ‘నన్ను ప్రేక్షకులంతా కూడా పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా ఈ చిత్రం కోసం పని చేశాను. ఈ రోజు ఈ సక్సెస్ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ మాట్లాడుతూ.. ‘ధృవ వాయు కళింగ సినిమా కోసం రెండేళ్లు చాలా కష్టపడ్డాడు. అడవుల్లో షూటింగ్ చేశాం. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. కళింగ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని ఆడియెన్స్ అంటున్నారు. సినిమాని చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

కెమెరామెన్ అక్షయ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. మా గురించి అందరూ బాగా రాశారు. టెక్నికల్ టీం గురించి మాట్లాడుతున్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన ధృవ వాయు గారికి థాంక్స్’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago