‘లియో’ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ “నా రెడీ” లిరికల్ వీడియో విడుదల

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ పవర్ ఫుల్ వీడియోలో విజయ్ రగ్గడ్ గా కనిపించారు. ఈరోజు, విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

పోస్టర్‌లో విజయ్ ఎవరినో స్లెడ్జ్‌హామర్‌తో కొడుతున్నట్లు వైల్డ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. దెబ్బ పడిన తర్వాత రక్తం, పళ్ళు గాలిలో ఎగరడం చూడవచ్చు. విజయ్ పక్కన హైనాను గమనించవచ్చు. మొత్తంమీద పోస్టర్..  లియోలో యాక్షన్‌లో ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. పోస్టర్‌పై ”In the world of untamed rivers, calm walters either become divine Gods or dreaded demons’ అనే క్యాప్షన్ రాసుంది.

విజయ్ బర్త్ డే సందర్భం గా టీం లియో ఫస్ట్ సింగిల్ “నా రెడీ ” లిరికల్ వీడియో కూడా విడుదల చేసారు ..ఫుల్ బీట్స్ తో ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 

7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

అక్టోబర్ 19న లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: 7 స్క్రీన్ స్టూడియో
సహ నిర్మాత: జగదీష్ పళనిసామి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: మనోజ్ పరమహంస
యాక్షన్: అన్బరివ్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
ఆర్ట్: ఎన్. సతీస్ కుమార్
కొరియోగ్రఫీ: దినేష్
డైలాగ్ రైటర్స్: లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైద్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్.
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

3 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

3 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

3 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

5 days ago