‘తల’ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీపై ప్రశంసలు కురిపించిన గెస్ట్ లు

దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా’తల’. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన..
దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “పాత తరంలో తల తాకట్టుపెట్టైనా పిల్లలన ప్రయోజనకులను చేయాలంటారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ తల పెట్టి కొడుకును మంచి హీరోను చేశాడు. టైటిల్ తల అన్నప్పుడు తమిళ్ లో తల అంటే వేరే అర్థం కదా అంటే కాదు తెలుగులో తల అనే అర్థం అన్నారు. గ్లింప్స్ బావున్నాయి. రాగిన్ రాజ్ బాగా ఆకట్టుకున్నాడు. మంచి ఫ్యూచర్ ఉందని అర్థం అవుతుంది. తెలిసిన ఆర్టిస్ట్ లున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజగారు పాటలు ఎక్స్ ల్లెంట్ గా చేశారు. ఈ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా..” అన్నారు.

నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. ” తల సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి మీ అందరూ మా అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీకి, అమ్మ రాగిన్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని, రాగిన్ కల నిజం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తల సినిమా తర్వాత అమ్మ రాజశేఖర్ గారు మీరు తలెత్తుకుని తిరగాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్నను ఎలా మర్చిపోరో.. తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ గారిని అలా మర్చిపోరు. మీరెప్పుడూ మా ఫ్యామిలీస్ తో ఉంటారు. ఎన్నో షోస్ లో మీ జడ్జిమెంట్ ద్వారా, బిగ్ బాస్ ద్వారా అందరికీ గుర్తుంటారు.నేనూ మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశాను. ఈ సినిమా మా అబ్బాయి సినిమా కంటే పెద్ద విజయం సాధించి మీరు ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.. “అన్నారు.

నటుడు రోహిత్ మాట్లాడుతూ..” ఈ 14న సినిమా విడుదలవుతోంది. మీరంతా థియేటర్స్ కు వచ్చి సినిమా చూడాలి. ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.ఎస్తేర్ గారితో కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.హీరోయిన్ బెంగాలీ అయినా తెలుగులో డైలాగ్స్ చెప్పింది బాగా నటించింది. హీరో రాగిన్ ను చూస్తే నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సినిమా బావుంది కాబట్టి మీరు రాగిన్ ను ఖచ్చితంగా ఆదరిస్తారు..” అన్నాడు.

నటి విజి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ” అమ్మ రాజశేఖర్ తో నాకు అస్సలు పరిచయమే లేదు. ఓ సారి ఫోన్ చేసి ఈ పాత్ర గురించి చెప్పారు. నాకు క్యారెక్టర్ నచ్చితేనే చేస్తాను. నా కొడుకు కోసం నేను చేసిన సినిమా ఇది అన్నప్పుడు నేను ఓకే చెప్పాను. ఇంతమంది ఉండగా నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స చెబుతున్నాను. హీరో రాగిన్ ఈ సినిమాకు బిగ్ ఎసెట్. రాగిన్ ను నేను ట్రిపుల్ ఆర్ అని చెబుతాను. ఫస్ట్ పిక్చర్ అయినా బాగా నటించాడు. మీరంతా ఈ సినిమాను థియేటర్స్ లో చూసి పెద్ద హిట్ అందిస్తారని కోరుకుంటున్నాను..” అన్నారు.

సీనియర్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “2013 నుంచి అమ్మ రాజశేఖర్ తో మంచి రిలేషన్ ఉంది.అతను కథలను కొత్తగా చెబుతాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే హీరోలో రవితేజ కనిపిస్తున్నాడు. ఈ మూవీతో రాగిన్ రూపంలో మరో కొత్త ఆణిముత్యం దొరుకుతాడు అని చెబుతున్నాను. రాజశేఖర్ కష్టం, శ్రీనివాస్ గారి నమ్మకం నిజమై ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ టీమ్ కు అభినందనలు” అని చెప్పారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం.. తల మూవీతో మునుపటి అమ్మ రాజశేఖర్ ను చూస్తారు. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అతను చెప్పినదానికంటే ఇంకా బెటర్ గా తీశారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలన్న కసి కనిపించింది. రాగిన్ రాజ్ చాలా అనుభవం ఉన్న నటుడులా కనిపించాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. ఇవాళ నాకోసం వచ్చిన మితృలందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ 14న రిలీజ్ అవుతున్న తల అన్ని రకాల ఎమోషన్స్ తో మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది..” అన్నారు.

నటి ఎస్తేర్ మాట్లాడుతూ ” ఈ కథ చాలా బావుంది. రాగిన్ రాజ్ కు మంచి డెబ్యూ అవుతుంది. అమ్మ రాజశేఖర్ గారు ఇతరుల ఫేమ్ ను వాడుకోవాలనుకోలేదు. అందరికీ గుర్తింపు వచ్చే పాత్రలే రాసుకున్నారు. ఎవరికి తగ్గ పాత్రవారికి ఇచ్చాడు. అందరూ హైలెట్ అయ్యేలా చేశారు. ఇది ఇండస్ట్రీలో రేర్ గా కనిపించే లక్షణం. నా పాత్ర నాకే ఛాలెంజింగ్ గా ఉంది. రోహిత్ గారితో వర్క్ చేయడం బావుంది.తల నాకు మంచి జాబ్ శాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను..” అన్నారు.

తల హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. “తల కథ మా నాన్న నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి.ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు..” అన్నాడు.

దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ” మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతాను. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ఆశీర్వదించాలి. హిట్ తరవాత అందరి గురించి మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారి చేసిన సపోర్ట్ లైఫ్ లాంగ్ మర్చిపోను. మీ లాంటి మంచి వారి కోసమైనా ఈ సినిమా హిట్ కావాలి. 14న విడుదలవుతోన్న తల చిత్రాన్ని మీరంతా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను..” అన్నారు.

దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago