సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. ఈ సినిమాకి యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది.

ఈ కలియుగంలోనూ హనుమంతుడు మానవ జాతికి దిశా నిర్దేశం చేస్తుంటారు. ప్రకృతి అనే అమ్మాయికి హనుమాన్ ఎన్నెన్నో కథలు చెబుతుంటారు. అందులో భాగంగానే రాముడు కథను చెప్తారు. సొంత ఊరిని వదిలేసి రాముడు అడవుల్లోకి జీవనం కొనసాగిస్తుంటారు. ఊర్లో హాస్పిటల్ కట్టించాలని రాముడి తండ్రి జీవితాంతం పోరాడుతూనే ఉంటాడు. ఇక రాముడు తన తండ్రి ఆశయాన్ని గుర్తించి, తన తప్పుని తెలుసుకుని ఊరికి తిరిగి వస్తాడు. ఊరికి తిరిగి వచ్చిన రాముడు చేసిన పనులు ఏంటి? ఊర్లోని చెడుని ఎలా నిర్మూలించాడు? ఊరిని ఎలా తీర్చిదిద్దాడు? అన్నదే కథ.

రామాయణ గాథను హనుమంతుడు చెప్పే సీన్లు, అక్కడ వాడే సీజీ అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి వర ప్రసాదమైన ఓ బిడ్డకు ఈ కథను హనుమంతుడు వివరిస్తుంటాడు. ఇందులో హనుమంతుడి పాత్రకు గానూ తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన గంభీరమైన గాత్రం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. ఈ చిత్రంలో శ్రీరాములు, స్వాతి మందాడి, అనుముల లక్ష్మణరావు, సుమన్, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, అప్పారావు, సమ్మెట గాంధీ, గడ్డం నవీన్, ఆనంద్ భారతి, చిట్టి బాబు, గోల్డ్ రెడ్డి, బేబీ గనిష్క రంద్రంక్షి
ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఈ సినిమాకి మనీష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. బొల్ల వెంకటేష్ బీజీఎం సమకూర్చారు. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉంటాయి. నజీర్ ఉద్దిన్, గీతా మాధురి, రమ్య బెహరా, నల్గొండ గద్దర్, మనీష్ కుమార్ ఈ పాటల్ని ఆలపించారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFJA

Recent Posts

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…

11 hours ago

‘అ’ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అందర్ని థ్రిల్ల్‌ చేస్తుంది: హీరో రాహుల్‌ విజయ్‌.

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…

11 hours ago

ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా స్పెషల్ ప్రివ్యూ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…

2 days ago

డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా…

2 days ago

ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…

3 days ago

సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…

3 days ago