వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై. తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పక్షి కాళ్లను చూపిస్తూ, ‘ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్ ను మీరు ఊహించలేదు..’అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. ఒక కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తో అందరిలో కలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి, తదితరులు
పబ్లిసిటీ డిజైన్ – అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – మేఘన గుమ్మడి
ఆర్ట్ డైరెక్టర్ – మక్కెన విజయ్ కుమార్, జీమోన్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జునైద్ ఉల్లా, హైకా స్టూడియోస్
అసోసియేట్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అల్లు బాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ – వెంకట్ రాహుల్
ఎడిటర్ – అఖిల్ చక్రవర్తి
మ్యూజిక్ – జేసిన్ జార్జ్
కో ప్రొడ్యూసర్స్ – వినీల సాహిత్య, కుష్లు
బ్యానర్స్ – కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్స్ – కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై
స్క్రిప్ట్, డీవోపీ, డైరెక్షన్ – అనూష్ గోరక్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…