ప్రముఖ తెలుగు సినిమా నటీమణి, నిర్మాత , గాయని, శోభనాచల స్టూడియో (చెన్న ) యజమాని అయిన శ్రీమతి సి. కృష్ణ వేణి (జననం 1924) ఫిబ్రవరి 16, 2025న హైదరాబాద్లో 102 సంవత్సరాల వయసులో మరణించారని, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ శ్రీమతి సి. కృష్ణ వేణి గారు, నిర్మాత శ్రీమతి ఎన్.ఆర్. అనురాధ దేవి తల్లి అని. శ్రీమతి సి. కృష్ణ వేణి తెలుగు సినిమా చరిత్రలో మిగిలి ఉన్న చివరి దిగ్గజాలలో ఒకరు అని, ఆమె “ధృవ విజయం” (1930) చిత్రంలో బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించి, కచ దేవయాని (1938)లో హీరోయిన్గా అరంగేట్రం చేసిందని తెలియజేశారు. ఆమె మీర్జాపురం రాజు గారిని వివాహం చేసుకుని, అతని స్టూడియో “శోభనాచల స్టూడియోస్” పగ్గాలు చేపట్టింది. వారు తీసిన “మనదేశం” (1949) సినిమాలో శ్రీ ఎన్. టి. రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసారు. ఆమె మనదేశం (1949), మల్లిపెల్లి (1939), భీష్మ, బ్రహ్మరత్నం. గొల్లభామ (1947) వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. ఆమె శ్రీ ఎ.ఎన్.ఆర్ తో కలిసి “కీలుగుర్రం” (1949లో ద్విభాషా చిత్రం) చిత్రంలో నటించారు. దివంగత హీరో రాజ్కుమార్తో కన్నడ చిత్రాలు (భక్త కుంబర) మరియు తమిళ భాషలో కూడా సినిమాలు నిర్మించారు . శ్రీ ఎస్.వి. రంగారావు, శ్రీమతి అంజలి, శ్రీ ఘంటసాల, శ్రీ రమేష్ నాయుడు మరియు గాయని పి. లీల మరియు శ్రీమతి జిక్కి వంటి గొప్ప కళాకారులను వారి కెరీర్లలో ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆమె అమూల్యమైన సేవలకు గాను, శ్రీమతి సి. కృష్ణ వేణిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. ఆమెను అమెరికాలోని “తానా” సత్కరించింది. హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో శ్రీ బండారు దత్తాత్రేయ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు మరియు ఇతర ప్రముఖులు ఆమెను ఎంతో ఆధరిస్తూ సత్కరించారు. విజయవాడలో జరిగిన ఆమె “మనదేశం” చిత్రం వజ్రోత్సవ వేడుకల్లో శ్రీమతి సి. కృష్ణ వేణిని గారిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు, గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన అద్భుతమైన సేవలను కొనియాడుతూ సత్కరించారు.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక రత్నాన్ని కోల్పోయిందని ప్రస్తావిస్తూ వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ శ్రీమతి సి. కృష్ణ వేణి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు దేవుడిని ప్రార్ధించారు.
(టి. ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…