డిజిటల్ సినిమా పైరసీని సమర్థవంతంగా అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) వారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వారితో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవడం జరిగినది.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా పైరసీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌లు, IPTV స్ట్రీమ్స్ మరియు మొబైల్ అప్లికేషన్‌లలో జరుగుతున్న డిజిటల్ పైరసీపై రియల్-టైమ్ పర్యవేక్షణ, త్వరితగతిన పైరసీ కంటెంట్ తొలగింపు మరియు సమన్వయంతో కూడిన చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబడింది.
సినిమా విడుదలైన వెంటనే జరిగే పైరసీ వల్ల పరిశ్రమకు కలిగే భారీ నష్టాలను అరికట్టేందుకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మరియు సినిమా పరిశ్రమ మధ్య వేగవంతమైన సమాచారం పంచుకోవడం, సమర్థవంతమైన సమన్వయం ఈ MoU యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి, IPS, TGCSB డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, IPS, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ డి. సురేష్ బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి శ్రీ కె. అశోక్ కుమార్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ దిల్ రాజు, నిర్మాతలు శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శ్రీ వై. సురేందర్ రెడ్డి, శ్రీమతి సుప్రియ యార్లగడ్డ, యాంటీ వీడియో పైరసీ సెల్ చైర్మన్ శ్రీ రాజ్‌కుమార్ ఆకెళ్ళ, యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రోజెక్ట్ హెడ్ శ్రీ మణింద్ర బాబు మరియు యాంటీ వీడియో పైరసీ సెల్ టీం సభ్యులు పాల్గొన్నారు.
—
తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…