ఘనంగా “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” ప్రధానోత్సవ కార్యక్రమం

ఎంట్రీలు పంపిన వారిలో చాలా టాలెంట్ ఉంది, వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం -టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

“టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యూరీ ఛైర్ పర్సన్ ఇంద్రజ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎంట్రీలు పరిశీలిస్తుంటే కొత్త వారిలో ఎంత టాలెంట్ ఉందో చూసి ఆశ్చర్యపోయామని ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఈ యంగ్ టాలెంట్ కు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి మొదటి బహుమతి లక్ష రూపాయలు అందిస్తామని డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో

టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలంగాణ ఏర్పడి 12ఏళ్లైన సందర్భంగా “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” నిర్వహించాలని ముందుకొచ్చాం. అవార్డ్స్ ప్రకటించిన 15 రోజుల్లోనే విజయంవంతంగా కార్యక్రమం నిర్వహించగలిగాం. దాదాపు 60కి పైగా ఎంట్రీలు వచ్చాయి. జ్యూరీ ఛైర్ పర్సన్ ఇంద్రజ గారు ఎంట్రీలను శ్రద్ధగా పరిశీలించి, ప్రతి షార్ట్ ఫిలింను చూసి విజేతలను ఎంపిక చేశారు. ఆమెను చూస్తే జ్యూరీ ఛైర్ పర్సన్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఎంట్రీలు పంపిన వారంతా యంగ్ స్టర్స్. వారి ప్రతిభ చూసి ఆశ్చర్యపోయం. వారు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎంతో క్వాలిటీతో చేశారు. వారికి ఉన్న వనరుల్లో ఇంతమంచి క్వాలిటీతో చేయడం అభినందనీయం. వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏడాది ముందుగా ప్రకటించిన దానికంటే మరింత నగదు బహుమతి జోడించి, మొదటి బహుమతి రూ.20 వేలు, రెండవ బహుమతి 15 వేలు, మూడవ బహుమతి 10వేలు అందించాము.వచ్చే ఏడాది మొదటి బహుమతిని లక్ష రూపాయలు, రెండవ బహుమతి 50వేలు, మూడవ బహుమతి 25వేలు అందిస్తాం. అవార్డ్స్ కు ఎంపిక కాని వారు బాగా చేయలేదని కాదు, వారు కూడా బాగా చేశారు అయితే అవార్డ్స్ కొందరికే ఇవ్వగలం. తెలంగాణ ఫిలింఛాంబర్ తరుపున ఫిలిం స్కూల్ కూడా పెట్టబోతున్నాం. ఈ అవార్డ్స్ కార్యక్రమ నిర్వహణలో నాకు ఎంతోమంది మిత్రులు, మీడియా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ అన్నారు.

జ్యూరీ ఛైర్ పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ – కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని మంచి ఉద్దేశంతో రామకృష్ణ గౌడ్ గారు “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” కార్యక్రమం చేపట్టారు. ఆయన డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నారు. ఆగిపోయిన ఎన్నో సినిమాలను రిలీజ్ చేయించారు. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తి చేస్తున్న కార్యక్రమం కాబట్టి నేను జ్యూరీ ఛైర్ పర్సన్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. సినిమా అనేది మీ కల, మీరు కోరుకునే భవిష్యత్తు. అందుకే జాగ్రత్తగా ప్రతి ఎంట్రీని పరిశీలించి అవార్డ్స్ కు ఎంపిక చేశాం. విజేతలు కాని వారు కూడా ఏం తక్కువ కాదు. ఫస్ట్ మూడు అవార్డ్స్ ఇవ్వాలి కాబట్టి ముగ్గురిని సెలెక్ట్ చేశాం. ఇది చాలా పెద్ద బాధ్యతగా ఫీలయ్యాను. మీరు పెట్టుకున్న ఆశలు ఎంత విలువైనవో నాకు తెలుసు. నేను టీవీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారి టాలెంట్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. నాకు వీలైనంతగా ఎవరికైనా చెప్పి అవకాశాలు ఇప్పించాను. కానీ ఇలాంటి పెద్ద వేదిక ఉంటే ఎక్కువమందికి అవకాశాలు వస్తాయి. ఇది సరైన వేదిక. ఎంట్రీలు పంపిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటారు. నాకు దక్కిన గుర్తింపు, సంపాదన అంతా ఇండస్ట్రీ ఇచ్చిందే. ఆ ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఈ కార్యక్రమంలో భాగమయ్యాను అన్నారు.

ఎస్ బీఐ బ్యాంక్ బోర్డ్ మెంబర్ నరసింహ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించి ఎంతోమంది స్థానిక కళాకారులను, సాంకేతిక నిపుణులను రామకృష్ణ గౌడ్ ప్రోత్సహిస్తున్నారు. ఈ “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” కార్యక్రమం ద్వారా యంగ్ టాలెంట్ కు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం అభినందనీయం అన్నారు.

హైకోర్టు అడ్వకేట్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ – ప్రతిభ గల కొత్త వారు తమ షార్ట్ ఫిలింస్ ప్రదర్శించి ఇండస్ట్రీని ఆకర్షించడానికి “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” మంచి వేదిక అని నేను నమ్ముతున్నాను. వచ్చే సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు నా తరపున ఇస్తానని హామీ ఇస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నారు.

టీమా ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్ మాట్లాడుతూ – రామకృష్ణ గౌడ్ గారు ఎప్పుడూ కొత్త కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తుంటారు. ఈ సారి మేమంతా ఆశ్చర్యపోయేలా చేశారు. “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” కార్యక్రమం ఏటా మరింత మందికి రీచ్ కావాలి. ఇంకా ఎక్కువ మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించేలా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. ఇంద్రజ గారి లాంటి అనుభవం గల హీరోయిన్ ఈ కార్యక్రమానికి ఛైర్ పర్సన్ గా ఉండి విజేతలను సెలెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.

సుప్రీంకోర్టు అడ్వకేట్ , నిర్మాత షరీఫ్ మాట్లాడుతూ – రామకృష్ణ గౌడ్ గారిలో రాముడు, కృష్ణుడు కలిసి ఉన్నారు. ఆయన కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” భారీ స్థాయిలో చేస్తున్నారు. యంగ్ టాలెంట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించాలని కోరుకుంటున్నా అన్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ ప్రైజ్ మనీ లక్ష రూపాయలు నేనే స్పాన్సర్ చేస్తాను అన్నారు.

హీరోయిన్ అక్సఖాన్ మాట్లాడుతూ – ఇంద్రజ గారు ఎంత డెడికేటెడ్ గా జ్యూరీ ఛైర్ పర్సన్ పనులు చేస్తున్నారో రామకృష్ణ గౌడ్ గారు మాతో చెబుతుంటారు. మూడు రోజుల పాటు ఆమె ఎంట్రీలన్నీ పరిశీలించి విజేతలను ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో నేనూ భాగమవడం సంతోషంగా ఉంది అన్నారు.

టీఎఫ్ సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్ మాట్లాడుతూ – ఎంట్రీలను పంపి అవార్డ్స్ గెల్చుకున్న వారికి అభినందనలు. రాని వారు కూడా నిరుత్సాహపడవద్దు. మళ్లీ ప్రయత్నించండి. రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి వేలాది మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. మీలోని ప్రతిభావంతులకు తప్పకుండా సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తాం. “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్ అన్నారు.

ఫైట్ మాస్టర్ రవి మాట్లాడుతూ – రామకృష్ణ గౌడ్ అన్నగారు “టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి ఈవెంట్స్ చేయడమే కాదు..తను నిర్మిస్తున్న చిత్రాల్లో అవకాశాలు ఇస్తున్నారు. నాకు దీక్ష సినిమాకు ఫైట్ మాస్టర్ గా చేసే అవకాశాలు కల్పించారు. వచ్చే ఏడాది నుంచి ఆయన ఫస్ట్ ప్రైజ్ కింది లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంతకంటే ఎక్కువే నగదు బహుమతి ఇస్తారు అన్నారు.

విజేతలు

బెస్ట్ జర్నలిస్ట్ (ప్రింట్ మీడియా) – వినాయకరావు ఆంధ్రజ్యోతి
బెస్ట్ ఫొటో జర్నలిస్ట్ – భూషణ్ మన తెలంగాణ
బెస్ట్ జర్నలిస్ట్ (ఎలక్ట్రానిక్ మీడియా) – సతీష్ ఈటీవీ 2
బెస్ట్ జర్నలిస్ట్ (ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్) – రఘు మాటీవీ
బెస్ట్ కెమెరామెన్ – పాషా 10టీవీ
బెస్ట్ వీడియో జర్నలిస్ట్ – నాగరాజు యాదవ్
బెస్ట్ జర్నలిస్ట్ (డిజిటల్ మీడియా) – రాజబాబు
బెస్ట్ ఫిలిం మేగజైన్ (బాక్సాఫీస్) – చందు రమేష్
బెస్ట్ ఫిలిం ఈపేపర్ – విజయ్

ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం – శీనుగాడి సైకిల్ స్టోరీ
సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం – సైబర్ స్లేవరీ
థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం – మాతృదేవోభవ

TFJA

Recent Posts

సెన్సార్ పేరుతో మా క్రియేటివిటీని, మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్…

6 hours ago

యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్: 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఈశా ఫౌండేషన్‌ - కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్…

1 day ago

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ టీమ్

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ…

1 day ago

ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న చిత్రాలయం స్టూడియోస్ “రామం” మూవీ

దోనేపూడి చక్రపాణి సమర్పణలో, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ…

1 day ago

“క”, “కె ర్యాంప్” తర్వాత వస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది – హీరో కిరణ్ అబ్బవరం

తిరుపతిలో భారీ జన సందోహం మధ్య గ్రాండ్ గా హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ మ్యూజికల్…

1 day ago

‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ…

2 days ago