పెయిడ్ ప్రీమియర్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ కిరణ్ అబ్బవరం మూవీ “క”

Must Read

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ సెన్సేషన్ “క” పెయిడ్ ప్రీమియర్స్ నుంచి యునానమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు నిన్న పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. “క” సినిమాకు చేసిన ప్రమోషన్, కంటెంట్ కు వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ తో ఈ పెయిడ్ ప్రీమియర్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రీమియర్స్ చూసిన వాళ్లంతా ఒక మెమొరబుల్ థ్రిల్లర్ చూశామని చెబుతున్నారు. ఈ మౌత్ టాక్ తో ఈ రోజు గ్రాండ్ రిలీజ్ కు వచ్చిన “క” సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో భారీ ఓపెనింగ్స్ దిశగా బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది.

“క” సినిమా చూసిన వాళ్లు ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లో ది బెస్ట్ ఫిలిం అంటున్నారు. అభినయ వాసుదేవ్ గా ఆయన పర్ ఫార్మెన్స్ కు ప్రశంసలు వస్తున్నాయి. రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక తమ నటనతో ఆకట్టుకున్నారు. థ్రిల్లర్స్ లోనే ట్రెండ్ క్రియేట్ చేసే కథా కథనాలతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” వంటి ఒక కొత్త ప్రయత్నంతో దర్శకులుగా తమ ప్రత్యేకత చూపించారు సుజీత్, సందీప్. టెక్నికల్ గా “క” బ్రిలియంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. సామ్ సీఎస్ మ్యూజిక్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. దీపావళికి రిలీజైన “క” బాక్సాఫీస్ సెన్సేషన్ గా మారడం ఖాయం.

“క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

Latest News

Seetha Payanam First Look Poster

On the occasion of Deepavali, The delightful first look poster of Seetha Payanam is unveiled by the makers. The...

More News