టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S99.’ యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్ ప్రసాద్ గారు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం చాలామంది కష్టపడి పని చేస్తున్నారు. S99 టైటిల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే S99 సినిమాని నిర్మించిన జగన్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ S99 సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మీ ముందుకు రాబోతుందని మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు జగన్మోహన్ గారు తెలిపారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. ఇలాంటి మరిన్ని చిత్రాలని తీయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత యతీష్ అన్నారు.
హీరో: జగన్మోహన్
హీరోయిన్: శ్వేతా వర్మ
కెమెరా: వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుధన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్ : యతీష్ అండ్ నందిని
పి ఆర్ ఓ : బి. వీరబాబు
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…