సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని సూపర్ యోధ నేపథ్యం లో సినిమా

హను-మాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక విజయం సాధించిన  తర్వాత, సూపర్ హీరో తేజ సజ్జా ప్రతిభావంతులైన యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేనితో కలిసి టాలీవుడ్ యొక్క అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 36 గా  నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఒక గ్రాండ్ స్కేల్ పాన్ ఇండియా మూవీ ఈరోజు అధికారికంగా ప్రకటించబడింది.

ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో సూపర్ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ తో బ్యాక్ పోజ్ లోహుందా గా ఉన్నాడు. హనుమాన్ చిత్రం లో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన తేజ ,ఇక్కడ మాత్రం స్టైలిష్ మేక్ ఓవర్ తో సూపర్ యోధాగా అద్భుతంగా కనిపించాడు. పోస్టర్ లో తన దుస్తులు మంటల్లో అంటుకోవడం గమనించవచ్చు .ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ ఏప్రిల్ 18న ప్రకటించనున్నారు.

ఈగిల్ తర్వాత కార్తీక్ ఘట్టంనేని మరియు పి ఎం ఎఫ్ కు ఇది వరుసగా రెండవ ప్రాజెక్ట్. అద్భుతమైన టెక్నీషియన్ అయిన కార్తీక్ ఘట్టంనేని,తేజ సజ్జను భారీ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేస్తూ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీని రాశాడు. ఇది సూపర్ యోధా యొక్క సాహసోపేతమైన కథ.

హై టెక్నికల్ మరియు ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లో నిర్మించే ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు
ఏప్రిల్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. తేజ హనుమాన్ తో పెద్ద హిట్ సాధించడంతో, దేశం మొత్తం అతని తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: కార్తీక్ ఘట్టంనేని
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కృతి ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల
రచయిత: మణిబాబు కరణం

PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

19 hours ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

19 hours ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 weeks ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 weeks ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 weeks ago