ప్రతిభ గల యువ నటీనటులకు శిక్షణ ఇచ్చి అవకాశాలు అందించే ఉద్దేశంతో ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో “ఈగిల్ ఐ సినీ స్టూడియో” హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు తేజ ఈగిల్ ఐ సినీ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢీ విన్నర్ అక్సాఖాన్, యువ నటి గాయత్రి రమణ, ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు తేజ మాట్లాడుతూ – ప్రసాద్ గారు నాకు చాలాకాలంగా తెలుసు. మా సినిమాలకు కావాల్సిన అన్ని ఏజ్ గ్రూప్స్ నటీనటులను ఇచ్చేవారు. ఆయన మంచి శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను తయారుచేస్తాడు. సినీ పరిశ్రమలో నటీనటులుగా స్థిరపడాలనుకునే వారికి సరైన శిక్షణ అవసరం. ఈగిల్ ఐ సినీ స్టూడియోలో మీకు అవసరమైన అలాంటి శిక్షణ ఇచ్చి అవకాశాలు కూడా చూపిస్తారు. ఈ సంస్థ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన యువ నటీనటులు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ – ఈ రోజు మా ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి మాకు తన విశెస్ అందించిన డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన మా వెల్ విషర్. తేజ గారి బెస్ట్ విశెస్ తో ఈగిల్ ఐ సినీ స్టూడియోను మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థగా తీర్చిదిద్దుతాం. అన్నారు.
హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ – దర్శకుడు తేజ గారంటే మాకు ఎంతో ఇష్టం. ఆయన ఎంతోమందిని ఇన్స్ పైర్ చేశారు. ఎన్నో మంచి మూవీస్ చేసి, చాలా మంది కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. తేజ గారు ఈరోజు ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు రావాలని వెయిట్ చేస్తున్నా. అన్నారు.
యువ నటి గాయత్రి రమణ మాట్లాడుతూ – నేను కూచిపూడి డ్యాన్సర్ ను, నటిగా ఇండస్ట్రీలో స్థిరపడాలని కోరుకుంటున్నా. ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఈగిల్ ఐ సినీ స్టూడియో అందరికీ రీచ్ కావాలి. మా లాంటి ఎంతోమంది కొత్త నటీనటులకు శిక్షణ, అవకాశాలు ఇప్పించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి వచ్చిన డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను ఓ ప్రముఖ టెలివిజన్ నిర్వహించిన డుం డుం డిగా డిగా డ్యాన్స్ షోలో విన్నర్ ను. అప్పుడు తేజ గారే నాకు బహుమతి ఇచ్చారు. అన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…