హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా “కన్యాకుమారి” సినిమా టీజర్ రిలీజ్

Must Read

ఆనంద్ దేవరకొండ హీరోగా “పుష్పక విమానం” సినిమా రూపొందించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దామోదర. ఆయన ప్రస్తుతం రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా “కన్యాకుమారి” సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. “కన్యాకుమారి” టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని ప్రశంసించిన విజయ్ దేవరకొండ, “కన్యాకుమారి” మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ తెలియజేశారు.

Kanyakumari Movie Official Teaser | Telugu Movie 2025 | Geeth Saini | Sree Charan | Radical Pictures

తను అనుకున్న విషయాన్ని మొహం మీదే చెప్పేసే శ్రీకాకుళం అమ్మాయి కన్యాకుమారి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని ‘నీది విగ్గు కదా..! అని అడిగే బెరుకులేని యువతి. కన్యాకుమారి అందానికి ఊర్లో అబ్బాయిలు వెంటపడితే చెంప చెళ్లుమనిపిస్తుంటుంది. ఈ పిల్లకు పొగరు అని అనుకున్నా పట్టించుకోదు. కన్యాకుమారి డిగ్రీ చదివినా…చీరల కొట్టులో పని చేయాల్సివస్తుంది. కన్యాకుమారి క్యారెక్టర్ లో గీత్ సైని పర్ ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా ఉంది. శ్రీచరణ్ రాచకొండకు కూడా మంచి డెబ్యూ మూవీ కానుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో “పుష్పక విమానం” సినిమాను రూపొందించిన దర్శకుడు దామోదర తన సెకండ్ ప్రాజెక్ట్ తో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించినట్లు టీజర్ తో తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక “కన్యాకుమారి” సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు – గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – నరేష్ అడుప
సినిమాటోగ్రఫీ – శివ గాజుల, హరిచరణ్ కె
మ్యూజిక్ – రవి నిడమర్తి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – రాడికల్ పిక్చర్స్
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ రెడ్డి చింతా, వరీనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్.ఎ
రచన, ప్రొడ్యూసర్, డైరెక్టర్ – దామోదర

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News