నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ప్రొడ్యూసర్ జయకాంత్ మాట్లాడుతూ – ఈ రోజు మా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. తెలుగులో వస్తున్న డిఫెరంట్ డార్క్ కామెడీ చిత్రమిది. సినిమా మొత్తం జాయ్ రైడ్ లా ఉంటుంది. నేను మురళీ ఈ మూవీని స్టార్ట్ చేశాం. బడ్జెట్ కొంచెం ఎక్కువైంది. అప్పుడు వేణు, అమర్ ముందుకొచ్చి మనం ఎంత బడ్జెట్ అయినా చేద్దాం అని సపోర్ట్ చేశారు. సంధ్యక్క లేకపోతే ఈ మూవీ కంప్లీట్ అయ్యేది కాదు. మా సినిమాకు యోగి బాబు గారు సహా మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను మీరంతా సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ – మేము ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. వేణుకు నాకు సినిమా మేకింగ్ మీద ప్యాషన్ ఉండేది. మన డ్రీమ్ ను ఎందుకు ఫుల్ ఫిల్ చేసుకోకూడదు అని ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాం. సినిమా బాగా వచ్చింది. నరేష్ అగస్త్యకు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. కామెడీ మూవీని బ్రహ్మానందం గారు, యోగి బాబు గారు లేకుండా ఊహించలేం. వారిద్దరు మా సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. అలాగే చిట్టిగా మనకు చాలా దగ్గరైన ఫరియా మా మూవీతో మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది. మా డైరెక్టర్ మురళీ మనోహర్ ప్రతిభావంతుడు. సిల్వర్ స్క్రీన్ మీద “గుర్రం పాపిరెడ్డి”తో త్వరలోనే ఒక మ్యాజిక్ చూస్తారు. అన్నారు.
మూవీ ప్రెజెంటర్ డా.సంధ్య గోలీ మాట్లాడుతూ – ఒక కొత్త తరహా పాయింట్ తో “గుర్రం పాపిరెడ్డి” సినిమాను నిర్మించాం. యూనిక్ డార్క్ కామెడీ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ టీమ్ తో ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. బ్రహ్మానందం, యోగిబాబు వంటి లెజెండ్స్ తో వర్క్ చేశాం. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్ గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట యోగిబాబు. ఇలా వీళ్లందరితో కలిసి నటించడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరియా సహా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటుడు వంశీ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా షూటింగ్ చాలా ఫన్ గా సాగింది. మేమంతా ఆ ప్రాసెస్ ను ఎంజాయ్ చేశాం. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు లాంటి పెద్దలతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ అందరినీ థ్రిల్ చేస్తుంది. అన్నారు.
నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా గురించి నెక్ట్స్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ వింటారు. ఈ చిత్రంలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎనర్జిటిక్ గా వర్క్ చేశారు. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
డీవోపీ అర్జున్ రాజా మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం లాంటి లెజెండ్ ను నా కెమెరా ద్వారా చూపించడం గౌరవంగా భావిస్తున్నా. యోగి బాబు గారి మూవీకి గతంలో అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశాను. ఈ చిత్రంలో ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా పెద్ద విజయం సాధించాలి. త్వరలో థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.
నటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మురళీ మనోహర్ కు థ్యాంక్స్. ఈ చిత్రంలో యోగి బాబు, బ్రహ్మానందంతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, క్రైమ్..ఇలా అన్ని ఎలిమెంట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ మూవీ అనుకున్నప్పుడు జయకాంత్ ముందుండి, వేణు, అమర్ , సంధ్య గారిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి పనిచేశారు. నరేష్, ఫరియా నుంచి దాదాపు 9 మంది టాప్ ఆర్టిస్టులు ఈ మూవీకి కంప్లీట్ గా సపోర్ట్ చేశారు. వాళ్లందరి సపోర్ట్ వల్లే సినిమా అనుకున్నట్లుగా సరైన టైమ్ లో కంప్లీట్ చేశాం. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ద్వారానే కథ నెరేట్ అవుతుంది. ఆయన ద్వారానే ఈ పాత్రలన్నీ పరిచయం అవుతాయి. “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహా మా టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడమ్ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది. “గుర్రం పాపిరెడ్డి” సక్సెస్ మీట్ లో తప్పకుండా తెలుగులో మాట్లాడుతా. అన్నారు.
నటుడు రాజ్ కుమార్ కాసిరెడ్డి – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ లో మీరు కాస్త ఫన్ చూశారు. మూవీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారు లాంటి పెద్దలు మా గురించి మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్లు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. మేము కూడా మీతో పాటే బిగ్ స్క్రీన్ మీద టీజర్ చూశాం. తన విజన్ లో మమ్మల్ని పార్ట్ చేసిన మా డైరెక్టర్ మురళీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో సౌధామిని అనే పాత్రలో నటించాను. బ్రహ్మానందం, యోగి బాబు వంటి పెద్దలతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నేను ఒప్పుకునేందుకు నరేష్ అగస్త్య ఒక రీజన్. ఇలాంటి మంచి నటుడితో మూవీ చేయాలని అనిపించేది. ఈ సినిమాలో నటించేప్పుడు ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. మా మదర్ ఈ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమాకు వర్క్ చేయడం సూపర్ ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది. ఇందులో ఒక సాంగ్ చేస్తున్నా, ఆ పాట స్పెషల్ గా ఉంటుంది. అన్నారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో నేను హీరో అంటున్నారు గానీ నేనొక్కడినే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారి లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. అందుకే ఈ కథ వినగానే ఒప్పుకున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకా మాట్లాడుతాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ – అర్జున్ రాజా
మ్యూజిక్ – కృష్ణ సౌరభ్
సమర్పణ – డా. సంధ్య గోలీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్)
నిర్మాతలు – వేణు సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం – మురళీ మనోహర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…